Ravi Shastri : నేను అనుకున్న మార్పు తీసుకురాగలిగాను.. భారత జట్టు ఎన్నో అద్భుతాలు చేసింది

టీమిండియా కోచ్ గా రవిశాస్త్రికి టీ20 వరల్డ్ కప్ ఆఖరి ఈవెంట్. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Ravi Shastri : నేను అనుకున్న మార్పు తీసుకురాగలిగాను.. భారత జట్టు ఎన్నో అద్భుతాలు చేసింది

Ravi Shastri

Ravi Shastri : టీమిండియా కోచ్ గా రవిశాస్త్రికి టీ20 వరల్డ్ కప్ ఆఖరి ఈవెంట్. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘టీమిండియా కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో జట్టు దృక్పథంలో మార్పు తీసుకురావాలని నాకు నేనే చెప్పుకున్నాను… నేను అనుకున్న మార్పు తీసుకురాగలిగాను’ అని వివరించారు. గత ఐదేళ్ల కాలంలో టీమిండియా ఎదిగిన తీరు చూస్తే ఆ విషయం స్పష్టమవుతుందని అన్నారు.

క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ జట్లలో ఒకటిగా అన్ని ఫార్మాట్లలోనూ తన ముద్ర ఉందని వివరించారు. సొంత గడ్డమీద బలమైన జట్లుగా పేరుగాంచిన అన్ని జట్లను విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు వాళ్ల సొంతగడ్డల మీదే ఓడించిందని తెలిపారు. కోహ్లీ ఎంతో మెరుగైన ప్రమాణాలు నెలకొల్పాడని కితాబునిచ్చారు. ముఖ్యంగా టెస్టు క్రికెట్ అత్యుత్తమ రాయబారుల్లో కోహ్లీ ఒకడని కొనియాడారు. “భారత జట్టు సొంతగడ్డపై ఎప్పుడూ బెబ్బులే. కానీ ఇప్పటి జట్టు అంతకుమించిన అద్భుతాలు చేసింది” అని వివరించారు.

Fact Check : మైపాడు బీచ్‌లో జలకన్య కలకలం.. వైరల్ వీడియో!

టీమిండియా తదుపరి కోచ్ రాహుల్ ద్రావిడ్ జట్టును మరో మెట్టు పైకి తీసుకెళతాడని భావిస్తున్నట్టు రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. “జట్టుకు రాహుల్ ద్రావిడ్ రూపంలో మెరుగైన వ్యక్తి దొరికాడు… అదే సమయంలో రాహుల్ ద్రావిడ్ కు అత్యుత్తమ జట్టు అందుబాటులో ఉంది” అని వివరించారు.

కొంతకాలంగా నిర్విరామంగా బబుల్ లో ఉండడం వల్ల శక్తులు హరించుకుపోయిన భావన కలుగుతోందని, ఆటగాళ్ల పరిస్థితి కూడా అదే విధంగా ఉండొచ్చని అనుకుంటున్నానని తెలిపారు. ఐపీఎల్ కు టీ20 వరల్డ్ కప్ కు మధ్య సుదీర్ఘ వ్యవధి ఉంటే బాగుండేదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా కథ ముగిసింది. తన ఆఖరి మ్యాచ్ లో నమీబియాపై విజయంతో భారత జట్టు వరల్డ్ కప్ ని ముగించింది. కాగా, సెమీస్ కి కూడా వెళ్లకుండానే భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించడం అభిమానులను బాధించింది. టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి.

Whatsapp: ఫెంటాస్టిక్ ఫీచర్.. వాట్సప్‌లో మెసేజ్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు

గ్రూప్-2లో పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్… ఆపై వరుసగా అఫ్ఘానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియా జట్లపై ఘన విజయాలు నమోదు చేసింది. అయితే నెట్ రన్ రేట్ కారణంగా లీగ్ దశలోనే నిష్క్రమించింది. భారత టీ20 జట్టుకు కెప్టెన్ గా కోహ్లీకి ఇదే చివరి టోర్నీ కాగా,
టీమిండియా కోచ్ గా రవిశాస్త్రికి కూడా ఇదే ఆఖరి మ్యాచ్.

ఇక, టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ దశకు తెరలేచింది. నవంబర్ 10న జరిగే తొలి సెమీస్ లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. నవంబర్ 11న జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. నవంబర్ 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.