Dutee Chand: డోపింగ్ టెస్టులో పట్టుబడ్డ ద్యుతీ చంద్… తాత్కాలిక నిషేధం విధింపు

ఈ అంశంపై నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ (ఎన్‌డీటీఎల్) ద్యుతీకి ఒక లేఖ రాసింది. ఈ సంస్థ ద్యుతీ నుంచి సేకరించిన నమూనాల్లో నిషేధిత సార్స్ ఎస్4 అండరైన్, ఓ డిఫినైలాండరిన్, సార్మ్స్ (ఎన్బోసార్మ్) (ఓస్టారిన్), లిగాండ్రోల్ మెటాబొలైట్ వంటి పదార్థాలు ఉన్నట్లు తేలింది.

Dutee Chand: డోపింగ్ టెస్టులో పట్టుబడ్డ ద్యుతీ చంద్… తాత్కాలిక నిషేధం విధింపు

Dutee Chand: భారత మహిళా స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ డోపింగ్ టెస్టులో దొరికిపోయింది. ఆమెకు తాజాగా నిర్వహించిన పరీక్షలో ఆమె శరీరంలో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ద్యుతీపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) తెలిపింది.

Bengaluru: గొంతు కోసి డిగ్రీ విద్యార్థిని హత్య.. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా దాడి చేసిన యువకులు

ఈ అంశంపై నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ (ఎన్‌డీటీఎల్) ద్యుతీకి ఒక లేఖ రాసింది. ఈ సంస్థ ద్యుతీ నుంచి సేకరించిన నమూనాల్లో నిషేధిత సార్స్ ఎస్4 అండరైన్, ఓ డిఫినైలాండరిన్, సార్మ్స్ (ఎన్బోసార్మ్) (ఓస్టారిన్), లిగాండ్రోల్ మెటాబొలైట్ వంటి పదార్థాలు ఉన్నట్లు తేలింది. ఇవి శరీరంలో పురుషుల వంటి లక్షణాల్ని కలిగిస్తాయి. ప్రస్తుతం ‘శాంపిల్-ఏ’లో నిషేధిత పదార్థాలు బయటపడ్డప్పటికీ, ఆమె ‘శాంపిల్-బి’ని పరీక్షించమని కోరే అవకాశం ఉంది. అందులో కూడా నిషేధిత పదార్థాలు ఉంటే ద్యుతీపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Shubman Gill: డబుల్ సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్ గిల్.. న్యూజిలాండ్‌పై భారత్ భారీ స్కోరు

ద్యుతీ చంద్ నుంచి ఈ నమూనాల్ని గత డిసెంబర్ 5న, భువనేశ్వర్‌లో సేకరించారు. ‘వాడా’ ప్రకారం.. ఈ పదార్థాలు శరీరంలో ఉంటే అవి పురుషుల్లో ఉండే శక్తి సామర్ధ్యాల్ని కలిగిస్తాయి. వీటి వల్ల క్రీడాకారుల సామర్ధ్యం పెరుగుతుంది. కాగా, ద్యుతీ చంద్ మన దేశంలోనే అత్యంత వేగంగా పరుగెత్తగల మహిళా స్ప్రింటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 100 మీటర్ల పరుగులో నేషనల్ ఛాంపియన్‌గా నిలిచింది. 2018 ఆసియా గేమ్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్లలో పతకాలు కూడా సాధించింది.