E-Auction : నీరజ్‌ ఈటె రూ. కోటి 55 లక్షలు, సింధు రాకెట్ రూ. 90 లక్షలు

ప్రధాని మోదీకి వచ్చిన బహుమతుల ఈ వేలం నిర్వహించారు. ఇందులో టోక్యో ఒలింపిక్స్‌లో ఆటగాళ్ల పరికరాలు, వస్తువులు కూడా ఉన్నాయి.

E-Auction : నీరజ్‌ ఈటె రూ. కోటి 55 లక్షలు, సింధు రాకెట్ రూ. 90 లక్షలు

Auction

PM Mementos : ప్రధాని మోదీకి వచ్చిన బహుమతుల ఈ వేలం నిర్వహించారు. ఇందులో టోక్యో ఒలింపిక్స్‌లో ఆటగాళ్ల పరికరాలు, వస్తువులు కూడా ఉన్నాయి. బిడ్‌లో ఫెన్సర్ భవానీ దేవి కత్తి అత్యధిక ధర పలుకుతోంది. భవానీదేవి కత్తికి 60లక్షల బేస్‌ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం పది కోట్లతో కొనసాగుతోంది. ఇక పీవీ సింధు రాకెట్ ధర 90 లక్షలుగా ఉంది.

Read More : Bihar : ఏక్ దిన్ కా కరోడ్ పతి..అకౌంట్లో రూ. 52 కోట్లు, కొంత ఇవ్వాలంటున్నాడు

ఇక టోక్యో ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణం అందించిన నీరజ్‌ చోప్రా ఉపయోగించిన ఈటెను కోటి బేస్‌ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం కోటీ 55లక్షలతో కొనసాగుతోంది. పారాలింపిక్స్‌లో రజతం సాధించిన మరో షట్లర్‌ సుహాస్‌ యతిరాజ్‌ రాకెట్‌ను 50లక్షల బేస్‌ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం 10కోట్లతో కొనసాగుతోంది.

Read More : Short Dress Problem : షార్ట్స్ వేసుకొని ఎగ్జామ్ రాయటానికి వీల్లేదన్న అధికారులు..ఆమె ఏం చేసిందంటే..

కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ వేలాన్ని నిర్వహిస్తోంది. ఇది వచ్చే నెల ఏడో తేదీ వరకు ఈ వేలం కొనసాగనుంది. వేలం పూర్తయిన తర్వాత అత్యధిక ధరతో బిడ్‌ వేసిన వారికి ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు. దీని ద్వారా సమకూరిన నిధులను గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన నమామి గంగే కార్యక్రమం కోసం వెచ్చించనున్నారు.