US Open: యూఎస్ ఓపెన్ ను గెలిచి చరిత్ర సృష్టించిన ఎమ్మా

యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో చరిత్ర సృష్టించింది బ్రిటీష్ యువ కెరటం.. దిగ్గజాలను మట్టికరిపించి ఇద్దరు అన్‌సీడెడ్‌ క్రీడాకారిణులు బరిలోకి దిగి...

10TV Telugu News

US Open: యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో చరిత్ర సృష్టించింది బ్రిటీష్ యువ కెరటం.. దిగ్గజాలను మట్టికరిపించి ఇద్దరు అన్‌సీడెడ్‌ క్రీడాకారిణులు బరిలోకి దిగిన ఫైనల్‌లో పోరులో విజయకేతనం ఎగరేసింది ఎమ్మా రదుకాను. మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో కెనాడాకు చెందిన 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను దక్కించుకుంది.

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకున్న తొలి క్వాలిఫైయర్‌గా రదుకాను చరిత్ర తిరగరాసింది. 150 ర్యాంక్ ప్లేయర్ ఎమ్మా.. తనకంటే మెరుగైన స్థానంలో కొనసాగుతున్న 73వ ర్యాంక్‌ క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్‌ను ఓడించింది. ఈ ఫీట్‌తో 44 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుకున్న బ్రిటన్‌ మహిళగా ఘనమైన రికార్డును ఎమ్మా నెలకొల్పింది. 1977లో వర్జీనియా వేడ్‌ బ్రిటన్‌ తరఫున తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ దక్కించుకుంది.

గేమ్ ఆరంభం నుంచి లెలాపై ఆధిపత్యం ప్రదర్శిస్తూనే ఉంది ఎమ్మా. చిన్నపాటి పొరబాట్లు మినహాయించి భారీ తప్పిదాలు చేయకుండా మొదటి సెట్‌ను 6-4 తేడాతో గెలిచింది. అదే ఆత్మవిశ్వాసంతో రెండో సెట్‌లో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. 6-3 తేడాతో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఇక ఎమ్మా టోర్నీ ఆసాంతం ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం.

Read Also: యూఎస్ ఓపెన్ టైటిల్ విజేత ఎమ్మా రాడుకాను

మొత్తం 20 సెట్లలోనూ గెలిచింది.. టైటిల్‌‌తో పాటు ఎమ్మా 2.5 మిలయన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఒక్కసారిగా 150 ర్యాంకు నుంచి 23కు ఎగబాకింది. బ్రిటన్‌లో తనే నెంబర్‌ వన్‌ క్రీడాకారిణి.

10TV Telugu News