ENG vs IND: ఇండియాతో మ్యాచ్‌లో రక్తం కారుతున్నా బౌలింగ్ చేసిన జేమ్స్ అండర్సన్

ఇంగ్లాండ్‌తో టీమిండియాకు జరుగుతున్న టెస్టు సిరీస్‌లో 39ఏళ్ల వయస్సున్న అండర్సన్ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తెచ్చేందుకు దేనికి వెనుకాడలేదు..

ENG vs IND: ఇండియాతో మ్యాచ్‌లో రక్తం కారుతున్నా బౌలింగ్ చేసిన జేమ్స్ అండర్సన్

Team India England

ENG vs IND: ఇంగ్లాండ్‌తో టీమిండియాకు జరుగుతున్న టెస్టు సిరీస్‌లో జేమ్స్ అండర్సన్ బౌలింగ్ పనితనానికి సాక్ష్యమిదే. 39ఏళ్ల వయస్సున్న అండర్సన్ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తెచ్చేందుకు దేనికి వెనుకాడలేదు. రక్తం కారుతున్నా హెడింగ్లీ వేదికగా కెప్టెన్ జో రూట్ నుంచి అందుకున్న ఆర్డర్ ను శిరసావహిస్తూ.. గురువారం నాలుగో టెస్టులో బౌలింగ్ చేస్తూనే ఉన్నాడు.

42వ ఓవర్ జరుగుతున్న సమయంలో కెమెరాలకు అతని ప్యాంటకు అంటిన రక్తం మరక కనిపించింది. ఫీల్డింగ్ చేస్తుండగా గాయమైనట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, టీం కోసం బౌలింగ్ వేస్తూ అతని డెడికేషన్ ను ప్రదర్శించాడు.

నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్‌.. బౌలింగ్ తీసుకోగా టీమిండియా.. 191 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. త‌క్కువ స్కోరుతోనే తొలి ఇన్నింగ్స్‌ను స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను శాసిస్తూ.. టీమిండియాను ఆదుకున్నాడు శార్దూల్. కేవ‌లం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. 57 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ చేరాడు.

శార్దూల్ త‌ర్వాత టీమిండియాను కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలబెట్టాడు. కోహ్లీ కూడా హాఫ్ సెంచ‌రీ చేసి.. ఔట్ అయ్యాడు. శార్దూల్‌.. 36 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్స్‌లు బాదాడు. కోహ్లీ.. 96 బంతుల్లో 8 ఫోర్లు కొట్టాడు. రోహిత్ శ‌ర్మ 11 ప‌రుగులు, కేఎల్ రాహుల్ 17 ప‌రుగులు, జ‌డెజా 10, ర‌హ‌నే 14, పంత్ 9, ఉమేశ్ 10 ప‌రుగులు చేశారు.

ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో క్రిస్ వోక్స్ నాలుగు వికెట్లు తీయ‌గా.. రాబిన్ స‌న్.. మూడు వికెట్లు తీశాడు. అండ‌ర్స‌న్ ఒక‌టి, ఓవ‌ర్ట‌న్ ఒక వికెట్ తీశారు.