వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన, జోఫ్రా ఆర్చర్ ఔట్

వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన, జోఫ్రా ఆర్చర్ ఔట్

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో పాల్గొనే అన్ని దేశాలు ప్లేయర్ల జాబితాను విడుదల చేస్తున్నాయి. ఏప్రిల్ 23 నాటికి జట్లు మొత్తం ప్రకటన పూర్తి అయిపోవాలి. మే 30న మొదలుకానున్న వరల్డ్ కప్ టోర్నీ కోసం ఇంగ్లాండ్ జట్టు ప్రకటించగా అందులో ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కలేదు. అతనికి బదులుగా ఆశ్చర్యకరంగా జోయ్ డెన్లీ చోటు దక్కించుకున్నాడు. 

మార్చి 17తో తన అంతర్జాతీయ క్రికెట్ అరంగ్రేటం చేసి 3ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ప్రపంచ కప్ జట్టు కోసమే అతణ్ని పాకిస్తాన్‌తో తలపడిన 5 వన్డే మ్యాచ్‌లలో ఆడించి సిద్ధం చేశారు. 

వరల్డ్ కప్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు: 
ఇయోన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్ స్టో(వికెట్ కీపర్), జోస్ బట్లర్, టామ్ కర్రాన్, జోయ్ డెన్లీ, అలెక్స్ హేల్స్, లియామ్ ఫ్లంకెట్, ఆదిల్ రషీద్, జోయ్ రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్

ఐసీసీ నియమావళి ప్రకారం.. ముందుగా 15మంది జట్టునే విడుదల చేశాం. పాకిస్తాన్‌తో ఆడిన 4వన్డేల సిరీస్‌లో 17మందిని ఎంపిక చేసుకుని అందులో ప్లేయర్లతోనే ఆడాం. ఈ సిరీస్ 2-2తో ముగిసింది.