IND vs ENG 2nd ODI: టీమిండియాకు రెండో వన్డేలో తప్పని ఓటమి

టీమిండియా బౌలింగ్‌ వైఫల్యం కొంపముంచింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ ఓటమి చవి చూసింది. తొలి వన్డే కంటే ఎక్కువ పరుగులే చేసినా.. బౌలింగ్ వైఫల్యంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

IND vs ENG 2nd ODI: టీమిండియాకు రెండో వన్డేలో తప్పని ఓటమి

England Beat India By Six Wickets

IND vs ENG 2nd ODI: టీమిండియా బౌలింగ్‌ వైఫల్యం కొంపముంచింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ ఓటమి చవి చూసింది. తొలి వన్డే కంటే ఎక్కువ పరుగులే చేసినా.. బౌలింగ్ వైఫల్యంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. తొలి వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ రెండో వన్డేలో మాత్రం అంతగా రాణించలేకపోయాడు. భువనేశ్వర్ కూడా ఈ మ్యాచ్‌లో అంతపొదుపుగా బౌలింగ్ చేయలేకపోయాడు.

శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. వీరితో పాటు ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో అయితే ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 336 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. పంత్, కెప్టెన్ కోహ్లీ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టగా… చివర్లో హర్దిక్ పాండ్యా ఇంగ్లీష్‌ బౌలర్లను ఊచకోత కోశాడు.

ఇక 337 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఎప్పటిలానే అదిరిపోయే ఓపెనింగ్ లభించింది. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌లలో జానీ బెయిర్‌స్టో సెంచరీతో అదరగొట్టాడు. బెన్ స్టోక్స్ భారత బౌలర్లను చీల్చిచెండాడాడు. ఒక పరుగుతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఓపెనర్ జేసన్ రాయ్ కూడా హాఫ్‌ సెంచరీతో రాణించాడు. కేవలం 43.3 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్ చేసి చరిత్ర సృష్టించారు ఇంగ్లీష్‌ ఆటగాళ్లు.

వన్డే చరిత్రలోనే తొలిసారి టీమిండియాపై భారీ టార్గెట్ ఛేదించి హిస్టరీ క్రియేట్ చేశారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు, భువనేశ్వర్ ఓ వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ 1-1తో సిరీస్ సమం చేసింది. మూడో వన్డే 28వ తేదీన జరగనుంది.

కీలక అంశాలు:
భారత్‌ స్కోర్‌ 336/6.. ఇంగ్లండ్‌ స్కోర్‌ 337/4
మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసిన ఇంగ్లండ్‌
28న పుణెలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య చివరి వన్డే
కేఎల్‌ రాహుల్ 108, పంత్‌ 77, కోహ్లీకి 66 పరుగులు
ప్రసిద్ధ్‌ కృష్ణ 2, భువనేశ్వర్‌కు ఒక వికెట్‌
టోప్లే 2, టామ్‌ కర్రన్‌ 2, రషీద్‌, సామ్‌ కర్రన్‌కు ఒక్కో వికెట్‌
బెయిర్‌స్టో 124, స్టోక్స్‌ 99, రాయ్‌ 55 పరుగులు
టీమిండియా బౌలింగ్‌లో చెలరేగిన ఇంగ్లీష్‌ టీమ్‌