66ఏళ్ల భారత్ రికార్డు.. ఇంగ్లాండ్ ఖాతాలోకి!

66ఏళ్ల భారత్ రికార్డు.. ఇంగ్లాండ్ ఖాతాలోకి!

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు టీమిండియా పూర్తిగా పైచేయి సాధించింది. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ను 59.5 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్‌ చేసి టీమిండియా పట్టు బిగించింది. ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంలో ఐదు వికెట్లు తీసి రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక పాత్ర పోషించగా.. ఈ మ్యాచ్‌లో అరుదైన 66 ఏళ్ల రికార్డు బ్రేక్‌ అయ్యింది.

తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు సాధించగా.. అరుదైన రికార్డు క్రియేట్ చేసింది భారత్‌ జట్టు.. ఈ మొత్తం పరుగులు భారత్‌ ఆటగాళ్లు సాధించనవే కాగా.. అందులో ఒక ఎక్స్‌ట్రా పరుగు రాకపోవడమే రికార్డుకు కారణం. ఒక ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రా రన్‌ లేకుండా అత్యధిక స్కోర్‌ 329 అందించిన జట్టుగా ఇంగ్లండ్‌ నిలవగా.. ఎక్స్‌ట్రా పరుగు లేకుండా భారీ స్కోరు చేసిన రికార్డును భారత్ కైవసం చేసుకుంది. తొలి టెస్టులో భారీ ఎక్స్‌ట్రాలు ఇచ్చిన ఇంగ్లండ్‌.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క ఎక్స్‌ట్రా కూడా ఇవ్వకపోవడం అసాధారణ విషయం.

66 ఏళ్ల తర్వాత భారత్‌ పేరిట ఉన్న ఈ రికార్డును ఇంగ్లండ్‌ అధిగమించగా.. 1955లో లాహోర్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క ఎక్స్‌ట్రా ఇవ్వకుండా 328 పరుగులిచ్చింది. ఆ రికార్డును ఇంగ్లండ్‌ బ్రేక్‌ చేయగా.. ఒక్క పరుగు ఇవ్వకుండా 329 పరుగులు ఇచ్చింది భారత జట్టు. ఆరు దశాబ్దాల ఆ రికార్డును ఇప్పుడు ఇంగ్లాండ్ చేతుల్లోకి ఒక్క పరుగు తేడాతో వెళ్లిపోయింది.