Eoin Morgan : ఒలింపిక్స్‌లో క్రికెట్ చేర్చాలన్న ఇంగ్లాండ్ కెప్టెన్

ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సైతం తన మనసులో మాట బయటపెట్టాడు. ఒలింపిక్స్ లో క్రికెట్ చేర్చాలని మోర్గాన్ అన్నాడు. ప్రస్తుతం అబుదాబిలో జరుగుతున్న టీ 10 లీగ్‌ లో ఢిల్లీ బుల్స్‌..

10TV Telugu News

Eoin Morgan : ప్రపంచంలో అత్యధిక క్రేజ్ ఉన్న ఆట ఏదంటే ఫుట్ బాల్ అనే సమాధానం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఆ తర్వాత అంత క్రేజ్ ఉన్న స్పోర్ట్ ఏదంటే.. క్రికెట్ అని చెప్పొచ్చు. అవును, క్రికెట్ కు కూడా భారీగానే అభిమానులు ఉన్నారు. అటువంటి క్రికెట్ ను ఒలంపిక్స్ లో చేర్చాలనే డిమాండ్లు ఇటీవల పెరిగాయి.

Bad Breath : నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా…అలా ఎందుకు జరుగుతుందంటే

తాజాగా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సైతం తన మనసులో మాట బయటపెట్టాడు. ఒలింపిక్స్ లో క్రికెట్ చేర్చాలని మోర్గాన్ అన్నాడు. ప్రస్తుతం అబుదాబిలో జరుగుతున్న టీ 10 లీగ్‌ లో ఢిల్లీ బుల్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మోర్గాన్ ఒలింపిక్స్ లో టీ10 ఫార్మాట్ క్రికెట్ ను చేర్చాలని అన్నాడు. క్రికెట్ ను అభివృద్ధి చేయడానికి ఒలింపిక్స్ ఒక గొప్ప అవకాశం అని చెప్పాడు. టీ10 క్రికెట్ ను అభిమానులు ఆస్వాదిస్తారని విశ్వాసం వ్యక్తం చేశాడు. టీ10 ఫార్మాట్ అంటే పది ఓవర్ల గేమ్. కేవలం 10 ఓవర్లు మాత్రమే ఉంటాయి.

Amaravathi : రాజధాని అంశంపై సీఎం జగన్ సంచలన ప్రకటన..మళ్లీ బిల్లు తీసుకొస్తాం

తాను ఎప్పుడూ కొత్తగా, క్రికెట్ మరింత ఎదగడానికి దోహదపడే అంశాలపై ఆలోచన చేస్తానన్న మోర్గాన్.. అందుకు ఒలింపిక్స్ ఒక మంచి అవకాశం అని తెలిపాడు. ఒలింపిక్స్ లో అనేక రకాల క్రీడలు ఉన్నాయి. కానీ, క్రికెట్ ను మాత్రం చేర్చలేదు. ఇటీవలి కాలంలో ఒలింపిక్స్ లో క్రికెట్ ను కూడా చేర్చాలను డిమాండ్లు వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే అభిమానులకు పండగే.