Eng Vs Pak: ఇలా కొట్టారేంటి భయ్యా.. ఒక్కరోజే 506 పరుగులు, 4 సెంచరీలు.. ఇది టెస్ట్ మ్యాచా టీ20 మ్యాచా? ఇప్పటికైనా భారత్‌తో పోల్చుకోవడం ఆపండి

ఇది టెస్ట్ మ్యాచా? టీ20 మ్యాచా? అనే డౌట్ వచ్చింది. ఇలా కొట్టారేంటి భయ్యా అని అంతా నివ్వెరపోతున్నారు. మరి, టెస్ట్ మ్యాచ్ లో అదీ ఒక్కరోజే 500లకు పైగా రన్స్ చేయడం అంటే మామూలు విషయమా? అవును, పాకిస్తాన్ తో తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఇరగదీసింది.

Eng Vs Pak: ఇలా కొట్టారేంటి భయ్యా.. ఒక్కరోజే 506 పరుగులు, 4 సెంచరీలు.. ఇది టెస్ట్ మ్యాచా టీ20 మ్యాచా? ఇప్పటికైనా భారత్‌తో పోల్చుకోవడం ఆపండి

Eng Vs Pak: ఇది టెస్ట్ మ్యాచా? టీ20 మ్యాచా? అనే డౌట్ వచ్చింది. ఇలా కొట్టారేంటి భయ్యా అని అంతా నివ్వెరపోతున్నారు. మరి, టెస్ట్ మ్యాచ్ లో అదీ ఒక్కరోజే 500లకు పైగా రన్స్ చేయడం అంటే మామూలు విషయమా? అవును, పాకిస్తాన్ తో తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఇరగదీసింది. ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. తొలి రోజే ఏకంగా 506 పరుగులు చేసి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే కొత్త రికార్ట్ నెలకొల్పింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. పాక్ బౌలర్లను.. ఇంగ్లండ్ బ్యాటర్లు ఊచకోత కోశారు.

ఓ టెస్టు మ్యాచ్ తొలిరోజే 500 పరుగులు చేసిన మొదటి జట్టుగా రికార్డు నెలకొల్పింది ఇంగ్లండ్. తద్వారా 112 ఏళ్లుగా ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును ఇంగ్లండ్ నేడు బద్దలు కొట్టింది. 1910లో సౌతాఫ్రికాపై ఆసీస్ జట్టు తొలిరోజున 494 పరుగులు చేసింది. ఆ రికార్డ్ ని నేడు ఇంగ్లండ్ జట్టు బ్రేక్ చేసింది.(Eng Vs Pak)

Also Read.. Women’s IPL: మహిళల ఐపీఎల్‌ ఫ్రాంచైజీ వేలానికి సిద్ధమవుతున్న బీసీసీఐ.. ఒక్కో ఫ్రాంచైజీ కనీస ధర రూ.400 కోట్లు

ఇంగ్లండ్ టీమ్ టాప్ ఆర్డర్‌లో ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీలు బాదడం విశేషం. పాక్ జట్టులో ఏ బౌలర్‌నూ వదల్లేదు. టీ20 మ్యాచ్ తరహాలో టెస్ట్ మ్యాచ్ సాగింది. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బౌలర్లమని చెప్పుకునే పాక్ బౌలర్లను వారి గడ్డ మీదే తలదించుకునేలా చేసింది ఇంగ్లండ్. 75 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి ఏకంగా 506 రన్స్ చేసింది ఇంగ్లండ్.

రావల్పిండిలో ఇవాళ ప్రారంభమైన మొదటి టెస్టులో ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ టాపార్డర్ ఆటగాళ్లు పాక్ బౌలింగ్ ను చీల్చి చెండాడారు. వెలుతురు లేమి కారణంగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 75 ఓవర్లలో 4 వికెట్లకు 506 పరుగులు చేసింది.(Eng Vs Pak)

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో పిచ్‌లో అడుగుపెట్టిన ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ ఆది నుంచే వన్డే మ్యాచ్ తరహాలో ఆడారు. జాక్ క్రాలే 122 (111 బంతుల్లో.. 21 ఫోర్లు), బెన్ డకెట్ 107 (110 బంతుల్లో.. 15 ఫోర్లు) సెంచరీలు చేశారు.

Also Read.. Ruturaj Gaikwad: ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు.. సరికొత్త చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్.. ట్రెండింగ్ వీడియో

తొలి వికెట్ కు వీరిద్దరూ 233 పరుగుల భారీ భాగస్వామ్యంతో పటిష్ఠ పునాది వేయగా.. ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ ఓలీ పోప్ (108) కూడా శతకం సాధించాడు. మాజీ కెప్టెన్ జో రూట్ 23 పరుగులకే ఔట్ కాగా, తొలి రోజు ఆట చివర్లో కొత్త కుర్రాడు హ్యారీ బ్రూక్ (101 బ్యాటింగ్) కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 81 బంతుల్లోనే 101 పరుగులు (14 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడికి జోడీగా క్రీజులో బెన్ స్టోక్స్ ఉన్నాడు. దూకుడుగా ఆడుతున్న స్టోక్స్ 15 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు. వీరి దూకుడుతో ఇంగ్లండ్ స్కోరు 500 మార్క్ దాటింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తొలి రోజే ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ చేయడంతో.. పాక్ బౌలింగ్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. తమది టాప్ క్లాస్ బౌలింగ్ అని చెప్పుకునే పాక్ టీమ్ కు ఇంగ్లాండ్ బౌలర్లు చుక్కలు చూపించారని, టెస్ట్ మ్యాచ్ లో టీ20 బ్యాటింగ్ చేశారని కామెంట్ చేశారు. ఇంత అద్భుతమైన బౌలింగ్ ఎక్కడా చూడలేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ట్రోలర్స్ కు ఛాన్స్ ఇవ్వడంలో పాక్ ను మించిన టీమ్ లేదంటున్నారు. ఇప్పటికైనా భారత్ తో పోల్చుకోవడం ఆపాలని పాక్ కు కౌంటర్స్ ఇస్తున్నారు.