143ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలాంటి మ్యాచ్ ఇదే తొలిసారి

143ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలాంటి మ్యాచ్ ఇదే తొలిసారి

కొద్ది నెలల క్రితం క్రికెట్ గ్రౌండ్ లో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ జరగడం ఊహకు కూడా రాలేదేమో. కానీ, ప్రస్తుతం హెల్త్ ప్రొటోకాల్స్ ప్రకారం.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా అదే జరిగేలా ఉంది. నాలుగు నెలల నిరీక్షణ తర్వాత ఇంగ్లాండ్-వెస్టిండీస్ ల మధ్య జరిగే తొలి టెస్టు మ్యాచ్ క్లోజ్‌డ్ డోర్స్ మధ్యనే జరిగేలా కనిపిస్తుంది. చరిత్రలో లేనటువంటి ఫీట్ జరగనుంది.

ఇంగ్లాండ్, వెస్టిండీస్ ప్లేయర్లు సౌతాంప్టన్ లోని ఏజిస్ బౌల్ లో మ్యాచ్ ఆడనున్నారు. కానీ, ఆ ఇరు జట్లకు వెల్ కమ్ చెప్పేందుకు స్టాండ్స్ లో ఫ్యాన్స్ కనిపించరు. బ్యానర్లు, పోస్టర్లు, స్లోగన్లు, అభిమాన ప్లేయర్ ప్లకార్డులు, క్రికెట్ లో హుర్రెత్తించే స్టంట్లు ఏమీ లేకుండానే మ్యాచ్ జరగనుంది.

బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్ లో మ్యాచ్ లు జరగాలని భావిస్తున్నారు. అంపైర్లు, ప్లేయర్లు, రిఫరీలు మాత్రమే కనిపించనుండగా ఫేవరేట్ ప్లేయర్లకు చీర్ కొట్టే అభిమానులు కనిపించరు. ప్రపంచమంతా కొవిడ్ మయం అయిపోగా తొలిసారి కీలకమైన మార్పులతో గేమ్ ఆరంభించేందుకు సిద్ధమవుతున్నారు. బంతి మెరుస్తూ ఉండడానికి ప్లేయర్లు తమ సెలైవాను ఉపయోగించడానికి వీల్లేదు. దాని నుంచే కరోనా వ్యాప్తి జరుగుతుందనే కారణంతో ఐసీసీ కూడా ఆ పద్ధతిని నిషేదించింది.

ప్లేయర్ ఎవరైనా బాల్ కు సెలైవా అప్లై చేస్తే అది అంపైర్ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ముందు ప్లేయర్ కు వార్నింగ్ ఇస్తారు. రిపీట్ అయితే మాత్రం టీం మొత్తంపై చర్యలు తీసుకుంటారు. ఇన్నింగ్స్ మొత్తంలో జట్టుకు రెండు వార్నింగ్ లు మాత్రమే ఉంటాయి. బాల్ పై సెలైవా రుద్దితే దానికి బదులుగా 5పరుగుల పెనాల్టీ విధిస్తారు. దాంతో పాటు సెలైవా అప్లై చేసిన వ్యక్తే దానిని శుభ్రం చేయాలి.