BCCI President Roger Binny: కోడలి ఎఫెక్ట్.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి ఎథిక్స్ ఆఫీసర్ నోటీసులు

బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్ కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటీసులు అందజేశారు. అయితే, ఈ నోటీసులో తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని రుజువుచేసేలా డిసెంబర్ 20లోగా బిన్నీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

BCCI President Roger Binny: కోడలి ఎఫెక్ట్.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి ఎథిక్స్ ఆఫీసర్ నోటీసులు

Rojar Binny

BCCI President Roger Binny: బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఈ ఏడాది అక్టోబర్ 18న బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే. బిన్నీ 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. తాజాగా 2023 వన్డే వరల్డ్ కప్‌ను గెలిచేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే సెలక్షన్ కమిటీపై వేటువేసిన బీసీసీఐ, త్వరలోనే ఫార్మాట్ల వారిగా కెప్టెన్లను నియమించాలనే యోచనలో రోజర్ బిన్నీ కసరత్తు చేస్తున్నారు. ఇదిలాఉంటే బిన్నీకి ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్ షాకిచ్చాడు.

BCCI President Roger Binny: బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. ఏకగ్రీవంగా ఎన్నిక

బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్ కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటీసులు అందజేశారు. అయితే, ఈ నోటీసులో తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని రుజువుచేసేలా డిసెంబర్ 20లోగా బిన్నీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. భారత్‌లో బీసీసీఐ మ్యాచ్‌ల ప్రసార హక్కులు ఉన్న స్టార్ స్పోర్ట్స్‌లో రోజర్ బిన్నీ కోడలు మయంతి లాంగర్ పనిచేస్తోంది. ఇది కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కిందకే వస్తుందని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘానికి చెందిన సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశాడు.

Roger Binny: బీసీసీఐ నూతన అధ్యక్షుడు రోజర్ బిన్నీ పూర్వికులు ఏ దేశస్తులో తెలుసా? బిన్నీ గురించి ఆసక్తికర విషయాలు ..

గుప్తా ఫిర్యాదుపై స్పందించిన ఎథిక్స్ ఆఫీసర్..  వివరణ కోరుతూ బిన్నీకి నోటీసులిచ్చాడు. నవంబర్ 21నే రోజర్ బిన్నీకి నోటీసులు జారీ చేస్తూ లేఖ రాశారు. అఫిడవిట్ ద్వారా డిసెంబర్ 20వ తేదీలోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని బిన్నీకి శరణ్ సూచించారు. ‘బీసీసీఐ నిబంధనల్లోని రూల్ 39(2)(బీ) కింద మీపై ఫిర్యాదు అందిందని.. మీరు రూల్ (1) (i), రూల్ 38(2)ను ఉల్లంఘించారని’ శరణ్ తన నోటీసులో పేర్కొన్నారు.