WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో కీపర్ ఎవరు..? ఇషాన్, భరత్‌లలో మాజీ వికెట్ కీపర్ మద్దతు ఎవరికంటే..?
మరో మూడు రోజుల్లో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు లండన్‌కు చేరుకుని తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

Ishan Kishan-KS Bharat
WTC Final: మరో మూడు రోజుల్లో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ ఆరంభం కానుంది. ఓవల్ వేదికగా భారత్(Team India), ఆస్ట్రేలియా(Australia) జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు లండన్‌కు చేరుకుని తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా సంగతి ఎలా ఉన్నప్పటికీ టీమ్ఇండియాను ప్రస్తుతం ఓ విషయం కలవరపెడుతోంది. అదే తుది జట్టు కూర్పు. మొదటి ఎడిషన్ ఫైనల్ మ్యాచ్‌లో తుది జట్టు కూర్పులో లోపాల వల్లే న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలు కావాల్సి వచ్చిందని పలువురు మాజీ క్రికెటర్లు మండిపడిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం చాలా మంది ఆటగాళ్లు ఫామ్‌లో ఉండడంతో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరం అవ్వడంతో తుది జట్టు ఎంపిక కష్టమవుతోంది. ప్రస్తుతం వికెట్ కీపర్ స్థానానికి ఇద్దరు ఆటగాళ్ల మధ్య పోటీ నెలకొని ఉంది. అందులో ఒకరు ఇషాన్ కిషన్ కాగా మరొకరు తెలుగు తేజం కేఎస్ భరత్. అయితే.. ఇషాన్ కిషన్ ఇప్పటి వరకు టెస్టుల్లో అరంగ్రేటం చేయలేదు. అయినప్పటికీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడంతో పాటు ఐపీఎల్‌లో ఫామ్ ఆధారంగా అతడిని పరిగనలోకి తీసుకోవచ్చు.
ఇక ఇదే విషయం పై టీమ్ ఇండియా మాజీ వికెట్ కీపర్ నయన్ మోంగియా స్పందించాడు. ఇషాన్ కిషన్ కంటే కేఎస్ భరత్‌ను తీసుకుంటేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా స్పెషలిస్ట్ కీపర్‌తోనే బరిలోకి దిగాలని సూచించాడు. ఏదో ఒక్క మ్యాచ్‌లో రాణించనంత మాత్రన చెడ్డ కీపర్ అయిపోడని, అతడు ఓ స్పెషలిస్ట్ వికెట్ కీపర్ అని చెప్పాడు.
ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో పిచ్ పరిస్థితులు విభిన్నంగా ఉంటాయని, ఇక్కడ వికెట్ కీపింగ్ చేయడం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు. బంతి బౌన్స్ కావడంతో పాటు చేతుల్లోంచి జారిపోవడం వంటివి జరుగుతుంటాయన్నాడు. బంతిపై రోజంతా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంటుందన్నాడు. కుకాబుర్రాతో ఆడడం కంటే డ్యూక్ బంతులతో ఆడడం కష్టమని, ఎక్కువగా సీమ్‌తో పాటు స్వింగ్ అవుతాయన్నాడు. తనకు గతంలో ఇంగ్లాండ్‌లో ప్రపంచకప్ ఆడిన అనుభవం ఉందని, అక్కడి పరిస్థితులపై అవగాహనతోనే ఈ విషయాలను తాను చెబుతున్నట్లు నయన్ మోంగియా చెప్పాడు.
Ruturaj Gaikwad: ప్రేయసిని పెళ్లాడిన టీమ్ఇండియా క్రికెటర్.. ఫోటోలు వైరల్.. ఆమె కూడా క్రికెటరే