IPL 2020: ఆరంజ్ క్యాప్ రేసులో ఐదుగురు..

10TV Telugu News

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు జరిగాయి. ప్రతి మ్యాచ్‌లోనూ దాదాపు బ్యాట్స్‌మెన్‌లు అర్ధ సెంచరీలు సాధించారు. పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఈ సీజన్లో తన మొదటి సెంచరీ సాధించాడు.

ప్రతి సంవత్సరం అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్‌కు ఆరంజ్ క్యాప్ దక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల ఆధారంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఫాఫ్ డుప్లెసిస్ పరుగులు చేయడంలో ముందంజలో ఉన్నాడు. ప్రస్తుతానికి ఆరంజ్ క్యాప్ అతని అకౌంట్‌లోనే ఉంది.మునుపటి రెండు మ్యాచ్‌లలో చెన్నై జట్టు బాగా ఆడలేదు. కానీ డు ప్లెసిస్ బ్యాట్ మాత్రం భారీ స్కోరు చేస్తోంది. రెండు అర్ధ సెంచరీలు చేసిన డుప్లెసిస్.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపిఎల్ 2020లో తొలి సెంచరీ సాధించిన పంజాబ్‌కు చెందిన కెఎల్ రాహుల్.. మూడో స్థానంలో పంజాబ్‌కు చెందిన మయాంక్ అగర్వాల్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నారు . హైదరాబాద్‌కు చెందిన మనీష్ పాండే ఐదో స్థానానికి చేరుకున్నాడు.

ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ చేతిలో పెట్టుకున్న డుప్లెసిస్ 3 మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు 72 పరుగులతో మొత్తం 173 పరుగులు చేశాడు. 149 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా రెండు అర్ధ సెంచరీలు చేశాడు డు ప్లెసిస్. ఇప్పటివరకు 11 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టాడు.రెండో స్థానంలో కెఎల్ రాహుల్ ఉన్నాడు. పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ అత్యధిక స్కోరుతో 2 మ్యాచ్‌లు ఆడి మొత్తం 153 పరుగులు చేశాడు. మొత్తం 16 ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 173గా ఉంది.

మూడవ స్థానంలో మయాంక్ ఉన్నాడు. పంజాబ్‌కు చెందిన మయాంక్ అగర్వాల్ 2 మ్యాచ్‌ల్లో 115 పరుగులు చేశాడు. నాల్గవ స్థానంలో రోహిత్ శర్మ.. ఐదవ స్థానంలో మనీష్ పాండే ఉండగా.. ఆరంజ్ క్యాప్ కోసం ప్రస్తుతానికి వీరు ఐదుగురు పోటీలో ఉన్నారు.

టాప్ 5 బ్యాట్స్‌మెన్లు:

ర్యాంకు ఆటగాళ్లు పరుగులు
1. ఫాఫ్ డు ప్లెసిస్ 173
2. కేఎల్ రాహుల్ 153
3. మయాంక్ అగర్వాల్ 115
4. రోహిత్ శర్మ 92
5. మనీష్ పాండే 85

 

×