IPL-2023: ఆరెంజ్ క్యాప్ ఈ బ్యాటర్‌కేనా? పోటీలో ఎవరెవరు? పర్పుల్ క్యాప్ ఎవరికి దక్కుతుండొచ్చు?

ఆర్సీబీ, గుజరాత్, చెన్నై, లక్నో టాప్ బ్యాటర్లకు ఆరెంజ్ క్యాప్ అందుకునే అవకాశాలు ఉన్నాయి. అందులో ఆర్సీబీ బ్యాటరే టాప్....

IPL-2023: ఆరెంజ్ క్యాప్ ఈ బ్యాటర్‌కేనా? పోటీలో ఎవరెవరు? పర్పుల్ క్యాప్ ఎవరికి దక్కుతుండొచ్చు?

IPL 2023

Faf Du Plessis: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023లో ఆరెంజ్ క్యాప్ (Orange Cap) రేసులో ఇప్పటికీ ఆర్సీబీ (RCB) బ్యాటర్ డు ప్లెసిస్ అగ్రస్థానంలోనే ఉన్నాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే బ్యాటర్ కు ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. డు ప్లెసిస్ ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడి 702 పరుగులు చేశాడు. అందులో ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డు ప్లెసిస్ ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఉన్నాడు. అతడు 14 మ్యాచులు ఆడి 625 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక మూడు, నాలుగు, అయిదవ స్థానాల్లో సీఎస్కే బ్యాటర్ కాన్వే (585 పరుగులు), గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (576 పరుగులు), ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ (538 పరుగులు) ఉన్నారు.

ఇప్పటికే డు ప్లెసిస్ చేసిన పరుగులు 702గా ఉన్నాయి. ప్రస్తుత ఐపీఎల్ లో ప్లేఆఫ్స్, ఫైనల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. గుజరాత్, చెన్నై, లక్నో టాప్ బ్యాటర్లకు ఆరెంజ్ క్యాప్ అందుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, మిగిలిన కొన్ని మ్యాచుల్లో వారు 702 పరుగులు దాటుతారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచులో వారు ఏ మేరకు ఆడతారో చూడాలి. మే 23న‌ క్వాలిఫ‌య‌ర్‌-1 మ్యాచ్, మే 24న‌ ఎలిమినేట‌ర్ మ్యాచ్‌ ఉన్నాయి.

పర్పుల్‌ క్యాప్‌ రేసులో

అత్యధిక వికెట్లు తీసిన వారికి ఇచ్చే పర్పుల్‌ క్యాప్‌ ఇస్తారు. పర్పుల్‌ క్యాప్‌ రేసులో గుజరాత్ బౌలర్లు షమీ, రషీద్ మధ్య పోటీ నెలకొంది. వారిద్దరు ఇప్పటివరకు 13 చొప్పున మ్యాచులు ఆడి 23 చొప్పున వికెట్లు తీశారు.

షమీ అగ్రస్థానంలో, రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక మూడో స్థానంలో రాజస్థాన్ బౌలర్ ఛాహెల్ ఉన్నాడు. అతడు 21 వికెట్లు తీశాడు. నాలుగు, అయిదవ స్థానాల్లో ముంబై బౌలర్ పీయూష్ చావ్లా (20) వికెట్లు, కోల్ కతా బౌలర్ వరుణ్ చక్రవర్తి (20) ఉన్నారు.

IPL 2023: అదీ కోహ్లీ దెబ్బంటే.. కీలక మ్యాచులో ఆర్సీబీ గెలుపుపై మీమ్స్.. హైదరాబాద్‌ మెట్రో ట్రైన్లలోనూ..