Faf du Plessis: తలకు గాయంతో హాస్పిటల్‌లో చేరిన డుప్లెసిస్

పాక్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ 6)లో స్టార్ ప్లేయర్ మిస్టర్ 360 తలకు గాయమైంది. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ ప్రస్తుత లీగ్ లో క్వెట్టా గ్లాడియేటర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

Faf du Plessis: తలకు గాయంతో హాస్పిటల్‌లో చేరిన డుప్లెసిస్

Du Plesis

Faf du Plessis: పాక్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ 6)లో స్టార్ ప్లేయర్ మిస్టర్ 360 తలకు గాయమైంది. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ ప్రస్తుత లీగ్ లో క్వెట్టా గ్లాడియేటర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. శనివారం జూన్ 12న అబుదాబి వేదికగా పెషావర్ జాల్మితో మ్యాచ్ జరిగింది.

జాల్మి ఇన్నింగ్స్ జరుగుతుండగా ఏడో ఓవర్లో ఓ ఘటన జరిగింది. ఫీల్డింగ్ చేస్తూ బౌండరీకి వెళ్తోన్న బంతిని ఆపేందుకు డైవ్ చేశాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెటర్ మొహమ్మద్ హస్నైన్ ను ఢీ కొట్టాడు. అదే సమయంలో డుప్లెసిస్ తలకు హస్నైన్ మోకాలు తగలడంతో సఫారీ ప్లేయర్ కింద పడిపోయాడు.

వెంటనే కరాచీలోని హాస్పిటల్ కు తరలించడంతో అతనిస్థానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ సైమ్ అయూబ్ ను మైదానంలోకి దించారు. క్వెట్టా గ్లాడియేటర్స్ ప్లేయర్ వరుసగా రెండు మ్యాచ్ లలోనూ సబ్‌స్టిట్యూట్ లను మ్యాచ్ లోకి దించింది. వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ హెల్మెట్‌ను మొహమ్మద్ మూసా బౌన్సర్ బలంగా తగలడంతో రస్సెల్ కు బదులుగా పేసర్ నజీమ్ షా మైదానంలోకి ఎంటర్ అయ్యాడు.

ఈ మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేట‌ర్స్ 198 ప‌రుగుల టార్గెట్‌ను చేధించ‌లేక 61 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. డుప్లెసిస్ ప్ర‌స్తుత ప‌రిస్థితిపై స‌మాచారం తెలియాల్సి ఉంది.