IPL 2022: థ్యాంక్యూ సీఎస్కే.. ఆర్సీబీకి వెళ్తున్నా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తనతో కలిసి ప్రయాణించినందుకు వెటరన్ దక్షిణాఫ్రికా ప్లేయర్ డుప్లెసిస్ జట్టుకు, మేనేజ్మెంట్ కు థ్యాంక్స్ చెబుతున్నాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో..

IPL 2022: థ్యాంక్యూ సీఎస్కే.. ఆర్సీబీకి వెళ్తున్నా

Du Plesis

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తనతో కలిసి ప్రయాణించినందుకు వెటరన్ దక్షిణాఫ్రికా ప్లేయర్ డుప్లెసిస్ జట్టుకు, మేనేజ్మెంట్ కు థ్యాంక్స్ చెబుతున్నాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో భాగంగా మొదటి రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.7కోట్లకు కొనుగోలు చేసింది. 2011 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తో చేసిన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ వీడియో ట్వీట్ చేశాడు.

2016, 2017సీజన్లలో చెన్నైను నిషేదించడంతో సీఎస్కేకు దూరమయ్యాడు.

‘చెన్నైకి, జట్టు అభిమానులకు, స్టాఫ్, మేనేజ్మెంట్, నాతో పాటు ప్రయాణించిన జట్టుకు థ్యాంక్స్ చెబుతున్నా. నాకు చాలా జ్ఞాపకాలను ఇచ్చారు. మీకు థ్యాంక్యూ చెప్పడం నాకు చాలా ముఖ్యం. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ప్రతి ఒక్కరినీ మిస్ అవుతా’ అని డుప్లెసిస్ చెప్పిన వీడియోను సీఎస్కే ట్విట్టర్ లో పోస్టు చేసింది.

Read Also : పెరుగుతో కలిపి ఎండుద్రాక్ష తీసుకుంటే!…

ఇప్పుడు డుప్లెసిస్.. గ్లెన్ మ్యాక్స్ వెల్, విరాట్ కోహ్లీతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. దీనిపై స్పందించిన డుప్లెసిస్ కొత్త ప్రయాణం పట్ల తాను ఎగ్జైటింగ్ గా ఉన్నానని అంటున్నాడు.

‘ఒక తలుపు మూసుకుంటే మరొకటి గొప్ప అవకాశాలతో తెరుచుకుంది. భవిష్యత్ ఏం నిర్ణయిస్తుందో చూడాలి. నా నుంచి నా కుటుంబం నుంచి మీ అందరికీ థ్యాంక్యూ వెరీ మచ్’ అని చెప్పాడు.

వేలానికి ముందు ఆర్సీబీ కేవలం విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్ వెల్, మొహమ్మద్ సిరాజ్ లను మాత్రమే జట్టులో అంటిపెట్టుకుంది.