FIFA World Cup-2022: ఎవరెవరిని ఏయే అవార్డులు వరించాయి?.. అత్యుత్తమ ఆటగాడు ఎవరు?

ఫ్రాన్స్‌ స్టార్‌ ఆటగాడు ఎంబాపెకు గోల్డెన్ బూట్ అవార్డు దక్కింది. అత్యధిక గోల్స్ చేసినందుకు గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. అర్జెంటీనా సారథి మెస్సిని ఈ అవార్డు వరిస్తుందని అందరూ భావించారు. అయితే, ఫైనల్ మ్యాచుకు ముందు వరకు మెస్సి, ఎంబాపె ఐదేసి గోల్స్‌ తో సమంగా ఉన్నారు. నిన్న జరిగిన ఫైనల్లో మెస్సి రెండు గోల్స్‌, ఎంబాపె హ్యాట్రిక్‌ గోల్స్ చేశారు. దీంతో అత్యధిక గోల్స్ చేసినందుకు గోల్డెన్ బూట్ అవార్డు ఎంపాబెను వరించింది. ఇక లియోనెల్ మెస్సి గోల్డెన్ బాల్ అవార్డు అందుకున్నాడు. టోర్నమెంట్లో ఉత్తమ ఆటగాడికి ఈ అవార్డు ఇస్తారు.

FIFA World Cup-2022: ఎవరెవరిని ఏయే అవార్డులు వరించాయి?.. అత్యుత్తమ ఆటగాడు ఎవరు?

FIFA World Cup 2022

FIFA World Cup- 2022: ఫిఫా ప్రపంచ కప్‌-2022 ముగిసింది. ఫైనల్లో అంచనాలకు తగ్గట్టు రాణించి ఫ్రాన్స్ పై అర్జెంటీనా విజయం సాధించిన విషయం తెలిసిందే. 1986 ప్రపంచ కప్ లో విజేతగా నిలిచిన అర్జెంటీనా మళ్ళీ ఇప్పుడు ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఆ జట్టు 2014 ప్రపంచ కప్ లో సెమీఫైనల్ వరకు వెళ్లి ఓడి, రన్నరప్‌గా నిలిచింది. నిన్న మ్యాచ్ ముగియగానే అర్జెంటీనా జట్టు ప్రపంచ కప్ ను ముద్దాడింది. అనంతరం ఏయే ఆటగాడికి ఏయే అవార్డులు దక్కాయో ప్రకటించారు.

ఫ్రాన్స్‌ స్టార్‌ ఆటగాడు ఎంబాపెకు గోల్డెన్ బూట్ అవార్డు దక్కింది. అత్యధిక గోల్స్ చేసినందుకు గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. అర్జెంటీనా సారథి మెస్సిని ఈ అవార్డు వరిస్తుందని అందరూ భావించారు. అయితే, ఫైనల్ మ్యాచుకు ముందు వరకు మెస్సి, ఎంబాపె ఐదేసి గోల్స్‌ తో సమంగా ఉన్నారు. నిన్న జరిగిన ఫైనల్లో మెస్సి రెండు గోల్స్‌, ఎంబాపె హ్యాట్రిక్‌ గోల్స్ చేశారు.

దీంతో అత్యధిక గోల్స్ చేసినందుకు గోల్డెన్ బూట్ అవార్డు ఎంపాబెను వరించింది. ఇక లియోనెల్ మెస్సి గోల్డెన్ బాల్ అవార్డు అందుకున్నాడు. టోర్నమెంట్లో ఉత్తమ ఆటగాడికి ఈ అవార్డు ఇస్తారు. అర్జెంటీనా ఎంజో ఫెర్నాండెజ్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు. అర్జెంటీనా ఆటగాడు ఎమిలియానో ​​మార్టినెజ్ కు ‘గోల్డెన్ గ్లౌ’ అవార్డు దక్కింది. ఉత్తమ గోల్ కీపర్ కు ఈ అవార్డు ఇస్తారు.

కాగా, మెస్సి సారథ్యంలోని అర్జెంటీనా ఫిఫా ప్రపంచ కప్‌-2022లో అద్భుత విజయాలను నమోదు చేసుకుంది. ఫైనల్లోనూ దూకుడు కొనసాగించి ప్రపంచ కప్ సాధించింది. రన్నరప్ గా ఫ్రాన్స్ నిలిచింది. ఇక మూడో స్థానంలో క్రొయేషియా ఉంది. 2018 ప్రపంచ కప్ ను ఫ్రాన్స్ గెలుచుకుంది. ఫిఫా ప్రపంచ కప్‌ లో వరుసగా రెండు సార్లు ఫైనల్ చేరడం చాలా అరుదుగా జరుగుతుంది. 1998లోనూ ఫ్రాన్స్ ప్రపంచ కప్ విజేతగా నిలిచింది.

తాజాగా జరిగిన ప్రపంచ కప్ గెలిస్తే మూడోసారి ఆ కప్ గెలుచుకున్న జట్టుగా నిలిచేది. బ్రెజిల్ 1958, 1962లో వరుసగా రెండుసార్లు ప్రపంచ కప్ గెలుచుకుంది. 60 ఏళ్లలో వరుసగా రెండుసార్లు ప్రపంచ కప్ ను ఏ జట్టు కూడా గెలవలేదు. వరుసగా రెండుసార్లు ప్రపంచ కప్ గెలుచుకునే అవకాశాన్ని ఫ్రాన్స్ కోల్పోయింది.

FIFA World Cup 2022 : ఫిఫా వరల్డ్‌కప్ విజేత అర్జెంటీనా, ఫైనల్లో ఫ్రాన్స్‌పై గెలుపు, 36ఏళ్ల తర్వాత టైటిల్