FIFA World Cup-2022: అసలుసిసలైన సమరానికి సమయం ఆసన్నం.. ఈ 4 జట్ల బలం ఎంత?

ఫిఫా ప్రపంచ కప్‌-2022లో అసలుసిసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. రేపు, ఎల్లుండి సెమీఫైనల్ మ్యాచులు జరగనున్నాయి. వాటిల్లో గెలిచిన రెండు జట్లు వచ్చే ఆదివారం ఫైనల్లో తలపడనున్నాయి. సెమీఫైనల్ కు అర్జెంటీనా, క్రొయేషియా, ఫ్రాన్స్, మొరాకో చేరాయి. రేపు అర్జెంటీనా, క్రొయేషియాకు మధ్య మ్యాచ్ జరగనుంది. ఎల్లుండి ఫ్రాన్స్, మొరాకో తలపడతాయి.

FIFA World Cup-2022: అసలుసిసలైన సమరానికి సమయం ఆసన్నం.. ఈ 4 జట్ల బలం ఎంత?

FIFA World Cup- 2022

FIFA World Cup- 2022: ఫిఫా ప్రపంచ కప్‌-2022లో అసలుసిసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. రేపు, ఎల్లుండి సెమీఫైనల్ మ్యాచులు జరగనున్నాయి. వాటిల్లో గెలిచిన రెండు జట్లు వచ్చే ఆదివారం ఫైనల్లో తలపడనున్నాయి. సెమీఫైనల్ కు అర్జెంటీనా, క్రొయేషియా, ఫ్రాన్స్, మొరాకో చేరాయి. రేపు అర్జెంటీనా, క్రొయేషియాకు మధ్య మ్యాచ్ జరగనుంది. ఎల్లుండి ఫ్రాన్స్, మొరాకో తలపడతాయి.

అర్జెంటీనా, క్రొయేషియా జట్లలో అర్జెంటీనా బలంగా కనపడుతోంది. ఇక ఫ్రాన్స్, మొరాకో జట్లలో ఫ్రాన్స్ బలంగా ఉంది. ఇప్పటివరకు జరిగిన ఆటతీరును, గత రికార్డులను పరిశీలించి చూస్తే ఫైనల్ కు అర్జెంటీనా, ఫ్రాన్స్ వెళ్లే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2018 ప్రపంచ కప్ ను ఫ్రాన్స్ గెలుచుకుంది. ఆ సమయంలో క్రొయేషియా రన్నరప్ గా నిలిచింది.

ఈ సారి క్వార్టర్ ఫైనల్లో అద్భుతంగా రాణించి సంచలన విజయాలు అందుకున్న క్రొయేషియా, మొరాకోను కూడా తక్కువగా అంచనా వేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒక్క ప్రపంచ కప్ కూడా గెలుచుకోలేదు. గతంలో ఫ్రాన్స్ రెండు సార్లు, అర్జెంటీనా రెండు సార్లు ప్రపంచ కప్ గెలుచుకున్నాయి.

లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా ఫిఫా ప్రపంచ కప్‌-2022లో అద్భుత విజయాలను నమోదుచేసుకుంది. అతడు తన కెరీర్ లో 10 స్పానిష్ లీగ్ టైటిళ్లతో పాటు ఫ్రాన్స్‌లో ఓ టైటిల్, 4 ఛాంపియన్స్ లీగ్స్ సాధించాడు. అర్జెంటీనా 2014 ప్రపంచ కప్ లో రన్నరప్‌గా నిలిచింది. 1986 ప్రపంచ కప్ లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ జట్టు మరోసారి కప్ గెలుచుకోలేదు.

ప్రస్తుత ఫిఫా ప్రపంచ కప్‌ క్వార్టర్ ఫైనల్లో మొరాకో ఎవరూ ఊహించని రీతిలో విజయం సాధించింది. బలమైన జట్టు ఫ్రాన్స్ తో ఎల్లుండి మొరాకో తలపడనుంది. ప్రపంచ కప్ లో సెమీఫైనల్ చేరిన మొదటి ఆఫ్రికన్ దేశం మొరాకో. ఈ జట్టులో చెల్సియా హకీమ్, అచ్రాఫ్ హకీ అద్భుతంగా రాణిస్తున్నారు. ఢిఫెన్స్‌ లో ఈ జట్టు బలంగా ఉండడంతో ప్రత్యర్థి జట్లు గెలవలేకపోతున్నాయి. మొరాకో ఇప్పటివరకు ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ మాత్రమే ఇచ్చింది.

క్రొయేషియా జట్టు 2018 ప్రపంచ కప్ లో ఫైనల్ కు చేరింది. ఈ సారి కూడా సెమీఫైనల్ లో అర్జెంటీనాకు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అప్పట్లో పెనాల్టీ షూటౌట్‌ ల ద్వారా ఆ జట్టు ఫైనల్ వరకు వెళ్లింది. క్రొయేషియా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రపంచ కప్ గెలవలేదు. క్రొయేషియా జట్టు 2018 ఫైనల్ వరకు వెళ్లి ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది.

గత ప్రపంచ కప్ విజేత ఫ్రాన్స్. ఈ సారి కూడా సెమీఫైనల్ లో గెలిచి ఫైనల్ చేరే అవకాశాలు బలంగా ఉన్నాయి. 2018 ఫైనల్ లో క్రొయేషియాను ఓడించి ఫ్రాన్స్ విశ్వవిజేతగా నిలిచింది. 1998లోనూ ఫ్రాన్స్ ప్రపంచ కప్ గెలిచింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ గెలిస్తూ మూడోసారి ప్రపంచ కప్ గెలుచుకున్న జట్టుగా నిలుస్తుంది. 1958, 1962లో వరుసగా రెండుసార్లు బ్రెజిల్ ప్రపంచ కప్ గెలుచుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు (60 ఏళ్లలో) వరుసగా రెండుసార్లు ప్రపంచ కప్ ను ఏ జట్టూ గెలుచుకోలేదు. ఇప్పుడు వరుసగా రెండు సార్లు కప్ గెలుచుకునే ఛాన్స్ ఫ్రాన్స్ కి వచ్చింది.

FIFA World Cup Journalist Died : ఫుట్ బాల్ మ్యాచ్ లైవ్ ఇస్తూ ప్రాణాలు విడిచిన మరో జర్నలిస్టు