FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్.. సెమీస్ చేరిన నాలుగు జట్లు.. ఫైనల్ రేసుకు రెడీ

ఫిఫా వరల్డ్ కప్ సెమీ ఫైనల్ చేరుకుంది. సెమీ ఫైనల్‌లో పాల్గొనే నాలుగు జట్లు ఖరారయ్యాయి. ఫ్రాన్స్, మొరాకో, అర్జెంటీనా, క్రొయేషియా జట్లు సెమీ ఫైనల్ చేరుకున్నాయి.

FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్.. సెమీస్ చేరిన నాలుగు జట్లు.. ఫైనల్ రేసుకు రెడీ

FIFA World Cup 2022: ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల్ని ఆకట్టుకుంటున్న ‘ఫిఫా వరల్డ్ కప్-2022’ తుది అంకానికి చేరుకోబోతుంది. క్వార్టర్ ఫైనల్ పోటీలు ముగిశాయి. సెమీస్ జట్లు ఖరారయ్యాయి. దీంతో ఇప్పుడు సెమీ ఫైనల్ రేసు మొదలుకాబోతుంది.

Twitter: రేపే ‘ట్విట్టర్ బ్లూ’ రీలాంఛ్.. ఐఫోన్లకు ఎక్కువ ఛార్జీ వసూలు

ఫ్రాన్స్, మొరాకో, అర్జెంటీనా, క్రొయేషియా జట్లు సెమీ ఫైనల్ చేరుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఫ్రాన్స్ 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఫ్రాన్స్ సెమీఫైనల్ చేరింది. ఫ్రాన్స్ స్టార్ ఒలివర్ గిరౌడ్ చేసిన గోల్ ఆ జట్టుకు విజయాన్ని అందించింది. ఫ్రాన్స్ తరఫున అరిలియన్ మరో గోల్ చేశాడు. దీంతో ఫ్రాన్స్ రెండు గోల్స్ నమోదు చేసింది. ఇంగ్లండ్ నుంచి హరీ కేన్ గోల్ సాధించాడు. దీంతో హాట్ ఫేవరెట్ టీమ్‌గా భావించిన ఇంగ్లండ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌తోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో సెమీఫైనల్ మ్యాచ్‌లకు నాలుగు జట్లు సిద్ధమవుతున్నాయి.

Maharashtra: వేధింపుల్ని అడ్డుకున్నందుకు చిన్నారిని, ఆమె తల్లిని క్యాబ్‌లోంచి తోసేసిన ప్యాసింజర్లు.. చిన్నారి మృతి

అర్జెంటీనా-క్రొయేషియా జట్ల మధ్య మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఈ నెల 14న జరగనుండగా, ఫ్రాన్స్-మొరాకో జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఈ నెల 15న జరుగుతుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలిచిన జట్లు ఫైనల్‌లో తలపడతాయి. ఈ నెల 18న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మధ్యలో ఈ నెల 17న సెమీ ఫైనల్ మ్యాచుల్లో ఓడిన జట్ల మధ్య ఒక మ్యాచ్ జరుగుతుంది. ఆఫ్రికా ఖండం నుంచి ఒక జట్టు (మొరాకో) సెమీ ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి.