Flying Sikh Milkha Singh : లెజండరీ ‘ఫ్లయింగ్ సిక్కు’ మిల్కా సింగ్..

మిల్కా సింగ్.. భారతీయ సిక్కు అథ్లెట్.. 1935 నవంబర్‌ 20న పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్న గోవింద్‌పురలో సిక్‌రాథోడ్‌ రాజపుత్రుల కుటుంబంలో జన్మించాడు. ఇతన్ని ఫ్లయింగ్ సిఖ్ గా పిలుస్తారు. కామన్వెల్త్ క్రీడలలో గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక భారత అథ్లెట్ గా మిల్కా గుర్తింపు పొందాడు.

Flying Sikh Milkha Singh : లెజండరీ ‘ఫ్లయింగ్ సిక్కు’ మిల్కా సింగ్..

Flying Sikh Milkha Singh, Independent India’s First Sporting Superstar

Flying Sikh Milkha Singh : మిల్కా సింగ్.. భారతీయ సిక్కు అథ్లెట్.. 1935 నవంబర్‌ 20న పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్న గోవింద్‌పురలో సిక్‌రాథోడ్‌ రాజపుత్రుల కుటుంబంలో జన్మించాడు. ఇతన్ని ఫ్లయింగ్ సిఖ్ గా పిలుస్తారు. 2013 ఏడాది నాటికి కామన్వెల్త్ క్రీడలలో గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక భారత అథ్లెట్ గా మిల్కా గుర్తింపు పొందాడు. భారత్ తరపున 1956లో జరిగిన మెల్బోర్న్ సిటీలో సమ్మర్ ఒలంపిక్స్, 1960లో రోమ్‍‌లో ఒలంపిక్స్‌లోను, 1964‌లో టోక్యోలో జరిగిన ఒలింపిక్ పోటీల్లోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. భారత ప్రభుత్వం మిల్కాను పద్మశ్రీ” పురస్కారంతో సత్కరించింది. 1951లో మిల్కాసింగ్‌ భారత సైన్యంలో చేరాడు. ఆర్మీ నిర్వహించిన పరుగుల పోటీలో మిల్కా ఆరో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతే అథ్లెట్‌గా అవతరించాడు. హైదరాబాద్‌తో మిల్కా సింగ్‌కు విడదీయరాని అనుబంధం ఉంది. సికింద్రాబాద్‌లోనే 9 ఏళ్లపాటు శిక్షణ పొందాడు. అనంతరం 1958 కామన్వెల్త్‌ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచాడు.

దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్‌కు భారత అథ్లెట్‌గా మంచి గుర్తింపు ఉంది. కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించాడు. 1958లో జరిగిన కామన్ వెల్త్ గేమ్‌లో అంచనాలకు మించి రాణించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. 1960లో రోమ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో మిల్కా ఫైనల్ చేరాడు. కానీ నాలుగో స్థానానికే పరిమితమయ్యాడు. ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి చేరిన తొలి భారత పురుష అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. 1956, 1960, 1964 ఒలింపిక్స్‌లో భారత్‌కి మిల్కాసింగ్ ప్రాతినిధ్యం వహించాడు.

1960 ఒలింపిక్ పోటీల్లో 400 మీటర్ల పరుగు పందెం అతడి కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. 45.73 సెకండ్ల పరుగులో 4వ స్థానంలో నిలిచాడు. భారత్ రికార్డుగా 40ఏళ్లు పాటు మిల్కాపై పేరిట నిలిచింది. దేశ విభజన సమయంలో అనాథగా మారిన మిల్కా సింగ్, తరువాత కాలంలో భారతదేశపు ప్రసిద్ధ క్రీడాకారుడిగా అవతరించాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న గోవింద్‌పురాలో ఒక సిక్కు రాథోడ్ రాజపుత్రుల కుటుంబంలో మిల్ఖా సింగ్ జన్మించాడు. అందులోని 8 మంది దేశ విభజనకు ముందే చనిపోయారు.

భారత విభజన సమయంలో జరిగిన హింసకాండలో తన తల్లిదండ్రులను, ఒక సోదరుడిని, ఇద్దరు సహోదరీమణులను పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రుల మరణాన్ని తన కళ్ల ముందే ప్రత్యక్ష్యంగా చూసి చలించిపోయాడు. అనాథగా పాకిస్తాన్ నుంచి భారత్‌కు రైల్లో వచ్చాడు. 1947లో, పంజాబ్ రాష్ట్రంలో హిందూవులు, సిక్కుల ఊచకోత సమయంలో మిల్కా సింగ్ ఢిల్లీకి వలస వచ్చాడు. కొంత కాలం వరకు ఢిల్లీలోని పురానా కిలా వద్ద ఉన్న శరణార్థ శిబిరంలో ఉన్నాడు. షహ్దారాలోని పునరావాస కేంద్రంలోనూ సింగ్ కొన్నాళ్లు ఉన్నాడు. ఆ తరువాత కొంత కాలం తన సోదరి వద్ద నివసించాడు. టిక్కెట్టు లేకుండా రైలులో ప్రయాణం చేసినందుకు మిల్కాను పోలీసులు తీహార్ జైలులో బంధించారు. తన తమ్ముడిని విడిపించుకోవడానికి సోదరి ఇష్వర్ కొంత నగదును అమ్మి, మిల్కాను విడిపించింది.

మిల్కా సింగ్ దుర్భరమైన జీవితంపై విరక్తి చెందాడు.. ఒక దోపిడి దొంగగా మారాలని నిర్ణయించుకున్నాడు. కానీ, తన సోదరుడు మల్ఖన్, సింగ్‌ను ఒప్పించి, భారత సైన్యంలో చేర్పించాడు. 1951లో సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రికల్ – మెకానికల్ ఇంజినీరింగ్ కేంద్రంలో అడ్మిషన్ లభించింది. అలా క్రీడలకు దగ్గరయ్యాడు. చిన్నప్పుడే పాఠశాలకు వెళ్లేసమయంలో 10 కిలోమీటర్ల దూరం పరుగెత్తేవాడు. కొత్తగా నియమితులైన సైనికుల కోసం జాతీయ స్థాయి పరుగుల పోటీని భారత సైన్యం నిర్వహించింది. అందులో మిల్కా సింగ్ 6వ స్థానంలో పోటీ చేశాడు. భారత సైన్యం అతనికి వ్యాయామ క్రీడలలో ప్రత్యేక శిక్షణ కల్పించింది.

1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో జరిగిన 200 మీటర్లు, 400 మీటర్ల పరుగుల పోటీలకు భారతదేశం తరపున మిల్ఖాసింగ్ ప్రాతినిధ్యం వహించాడు. కానీ, ప్రధాన పోటీకి మాత్రం అర్హత సాధించ లేకపొయాడు. అప్పుడు జరిగిన (1956 మెల్బోర్న్ ఒలింపిక్స్) 400మీటర్ల పరుగుల పోటీలో విజేతగా నిలిచిన చార్ల్స్ జెన్కిన్స్ తో మిల్ఖాసింగ్‌కు పరిచయం ఏర్పడింది. చార్ల్స్.. మిల్కా సింగ్‌ను ప్రోత్సహించాడు. అనేక శిక్షణా పద్ధతుల నేర్పించాడు. 1956లో, కటక్ లో నిర్వహించిన జాతీయ క్రీడల్లో మిల్కా సింగ్ 200, 400 మీటర్ల పరుగుల పోటీల్లో గోల్డ్ మెడల్ తోపాటు అనేక రికార్డులు నెలకొల్పాడు. 1958లో జరిగిన ఆసియా క్రీడల్లోనూ స్వర్ణపతకాన్ని గెలుపొందాడు. 1958 బ్రిటిష్ సామ్రాజ్యం, కామన్వెల్త్ సమాఖ్యలు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ క్రీడల్లో, 46.6 సెకన్ల సమయంలో పరుగుల పోటీని పూర్తిచేసి గోల్డ్ మెడల్ సాధించాడు మిల్కా సింగ్, భారతదేశం తరపున బంగారు పతకం సాధించిన మొట్టమొదటి క్రీడాకారుడిగా అవతరించాడు. 2013 నాటికి, కామన్వెల్త్ క్రీడలలో బంగారు పతకం సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు.

క్రీడలనుంచి విరమించాక పంజాబ్ క్రీడల డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. మిల్కా సింగ్, 2021 మే 24న కొవిడ్ సంబంధ శ్వాస సమస్యలతో చండీగఢ్‌లోని ఆసుపత్రిలో చేరాడు. 91 ఏళ్ల వయసులో 2021 జూన్ 18 రాత్రి 11:30 కి మరణించాడు. అతని భార్య నిర్మల్ కర్ కూడా కోవిడ్ బారిన పడి 2021 జూన్ 13న మరణించింది. నిర్మల్ కౌర్ కూడా క్రీడాకారిణి.. భారత్ మాజీ వాలీబాల్ కెప్టెన్ కూడా. మిల్కాకు కుమారుడు జీవ్ మిల్కా సింగ్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మిల్కా కుమారుడు జీవ్ మిల్కా సింగ్ ఒక గోల్ఫ్ క్రీడాకారుడు.

పంజాబీ వెటరన్‌కు 1959లో భారత ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. ‘ఫ్లయింగ్ సిక్కు’ గా పేరొందిన మిల్కా సింగ్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పేరు తెచ్చుకున్నాడు. తన జీవితకాలంలో 80 రేసుల్లో 77 సార్లు విజయం సాధించాడు. విశ్రాంత క్రీడాకారుల వైద్య ఖర్చులకు ట్రస్ట్ నెలకొల్పాడు.. మిల్కా సింగ్ జీవితం ఆధారంగా బాగ్ మిల్కా బాగ్ అనే చిత్రం తెరకెక్కింది.