Lionel Messi: లియోనెల్ మెస్సీ కోసం కోల్‌కతాలో పూజలు.. వైరల్ అవుతున్న వీడియో

‘ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్’ ఫీవర్ మన దేశంలోనూ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా వంటి పట్టణాల్లో అర్జెంటినా గెలవాలని కోరుతూ ఫ్యాన్స్ పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Lionel Messi: లియోనెల్ మెస్సీ కోసం కోల్‌కతాలో పూజలు.. వైరల్ అవుతున్న వీడియో

Lionel Messi: ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌పై క్రేజ్ నెలకొన్న సంగతి తెలిసిందే. మన దేశంలో అయితే, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా వంటి పట్టణాల్లో ఈ ఆటకు చాలా క్రేజ్. అందులోనూ అర్జెంటినా లెజెండ్ లియోనెల్ మెస్సీకి ఫ్యాన్స్ ఎక్కువ.

Maharashtra: బాలికపై పన్నెండు గంటలపాటు సామూహిక అత్యాచారం.. 8 మంది నిందితులు అరెస్ట్

అందుకే ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటినా గెలవాలని, మెస్సీ అదరగొట్టాలని కోరుతూ కోల్‌కతాలో పూజలు, యజ్ఞాలు కూడా నిర్వహిస్తున్నారు అభిమానులు. వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అర్జెంటినా-ఫ్రాన్స్ జట్ల మధ్య ఇప్పటికే ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో ఎక్కువ మంది అర్జెంటినా గెలవాలనుకుంటున్నారు. దీనికోసం వీధుల్లో లియోనెల్ మెస్సీ ఫ్లెక్సీలు పెట్టి, రోడ్డుపై యజ్ఞాలు చేస్తున్నారు. పలువురు అభిమానులు అర్జెంటినా టీమ్ దుస్తులు ధరించి వీటిల్లో పాల్గొంటున్నారు. ఇంకొన్ని చోట్ల కొందరు పూజలు నిర్వహిస్తున్నారు. ఇలా పూజలు చేయడంపై కొందరు సానుకూలంగా స్పందిస్తే.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు.

Sachin Tendulkar: సచిన్.. సచిన్.. సచిన్.. విమానంలో హోరెత్తిన ఫ్యాన్స్ నినాదాలు.. ఎందుకంటే

ఏదేమైనా మన దేశంలో ఈ ఆటకు ఇటీవల క్రేజ్ పెరుగుతోంది. కాగా, గతంలో ఫ్రాన్స్-అర్జెంటినా జట్లు ప్రపంచ కప్‌లో మూడుసార్లు పోటీ పడ్డాయి. ఈ మూడింట్లో రెండుసార్లు అర్జెంటినా గెలవగా, ఒకసారి ఫ్రాన్స్ గెలిచింది. మరి ఈ సారి ఎవరు గెలుస్తారో చూడాలి. ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మ్యాచ్ ప్రారంభం కాగా, అర్జెంటినా రెండు గోల్స్ చేసి లీడ్‌లో కొనసాగుతోంది.