ఫుట్‌బాల్ లెజెండ్‌ మారడోనాకు బ్రెయిన్ సర్జరీ

ఫుట్‌బాల్ లెజెండ్‌ మారడోనాకు బ్రెయిన్ సర్జరీ

Football: ఫుట్‌బాల్ దిగ్గజం అర్జెంటీనా గ్రేట్ డిగో మారడోనా బ్రెయిన్ సర్జరీకి రెడీ అయ్యారు. బ్లడ్ క్లాట్ అవడంతో బ్యూనోస్ ఎయిర్స్‌లో మంగళవారం అడ్మిట్ అయ్యారు. ‘ఆయణ్ను నేను ఆపరేట్ చేస్తాను. ఇది రొటీన్ ఆపరేషన్ మాత్రమే. అతని నుంచి కూడా స్పష్టత ఉంది’ అని లిపొల్డో ల్యూక్వే అన్నారు.

వరల్డ్ కప్ విన్నర్ మారడోనా, 60 అనారోగ్యంతో బాధపడుతుండటంతో సోమవారమే హాస్పిటల్‌కు వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. ఈ మేరకు జరిగిన పరీక్షల్లో స్కానింగ్ లో బ్లడ్ క్లాట్ అయినట్లు తెలిసిందని అర్జెంటీనా మీడియాలో స్పష్టం చేసింది. ఫలితంగా తలకు హాని చేకూరేలా ఉందని వైద్యులు వెల్లడించారు.



ఆ టెస్టు ఫలితాలు రాకముందే ల్యూక్వే మారడోనా తనకు కాస్త బెటర్ గానే ఉందని వెళ్లిపోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. టెస్ట్ రిజల్ట్స్ చూసిన డాక్టర్లు మారడోనా చాలా నీరసంగా, అలసిపోయి ఉన్నారని బ్లడ్ క్లాట్ దీనికి కారణం అని చెప్పారు.

మారడోనాకు ఇది చాలా కష్టంగా అనిపించొచ్చు. జీవితంలో చాలా ఒత్తిళ్లు తట్టుకునే వ్యక్తుల్లో ఆయనొకరు. ఆయనకు మనం కచ్చితంగా సాయం చేయాల్సి ఉంది. అని డాక్టర్ అన్నారు. గత శుక్రవారమే ఆయన 60వ బర్త్ డేను జరుపుకున్నారు.
https://10tv.in/covid-attack-certain-blood-groups-research-odense-university/
మారడోనాకు డ్రగ్, ఆల్కహాల్, అనారోగ్యం వంటి కంప్లైంట్స్ తో ఉన్న హిస్టరీ ఉంది. కొద్ది రోజుల క్రితం మారడోనా బాడీ గార్డ్ కు కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయట. అనుమానంతో టెస్టులు చేయించుకున్న మారడోనాకు మాత్రం నెగెటివ్ వచ్చింది.

అతని పుట్టిన రోజును క్లబ్ ట్రైనింగ్ గ్రౌండ్ లో సెలబ్రేట్ చేస్తుండగా.. అక్కడకు నడిచి రాలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. అసిస్టెంట్ల సహాయంతో నడిచి వచ్చిన మారడోనా కేవలం 30నిమిషాలు మాత్రమే అక్కడ ఉండి వెళ్లిపోయారు.

అతని కూతుళ్లలో ఒకరైన గిన్నియా ట్వీట్ లో ‘ఇలా అతన్ని చూస్తుంటే నా హృదయం పగిలిపోతుంది’ అని పోస్టు చేశారు. గతంలో మారడోనాకు రెండు సార్లు గుండెనొప్పి కూడా వచ్చింది.