Vinod Kambli: మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య .. కేసు నమోదు

భారత జట్టు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి వివాదాల్లో వ్యక్తిగా మారాడు. ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో అతని భార్య ఆండ్రియా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

Vinod Kambli: మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య .. కేసు నమోదు

Vinod Kambli

Vinod Kambli: భారత జట్టు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి వివాదాల్లో వ్యక్తిగా మారాడు. అతనిపై ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వినోద్ కాంబ్లీ మద్యం మత్తులో తనను దుర్భాషలాడాడని, వంట పాన్ హ్యాండిల్‌ని తనపైకి విసిరి, తనను గాయపర్చాడని ఆరోపిస్తూ కాంబ్లీ భార్య ఆండ్రియా హెవిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 1.30గంటల సమయంలో జరిగిందని, బాంద్రా ప్లాంట్‌కు మద్యం మత్తులో వచ్చిన కాంబ్లి ఇలా ప్రవర్తించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆండ్రియా పేర్కొంది.

Vinod Kambli: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయిన సచిన్ చిన్ననాటి ఫ్రెండ్

ఆండ్రియా ఫిర్యాదుకు సంబంధించి పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. బాంద్రా ప్లాట్‌కు మద్యం మత్తులో వచ్చిన కాంబ్లీ భార్య ఆండ్రియాపై గొడవ పడ్డాడని ఫిర్యాదులో ఉందని తెలిపారు. ఆ సమయంలో 12ఏళ్ల కుమారుడు కాంబ్లీని శాంతిపజేసేందుకు ప్రయత్నం చేశాడని, అయినా వినకుండా అతను వంట గదిలోకి పరిగెత్తి వంట పాన్ హ్యాండిల్ తీసుకొని ఆండ్రియాపై విసిరాడని ఫిర్యాదులు పేర్కొన్నట్లు చెప్పాడు. తలకు గాయం కావటంతో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేకంటే ముందు ఆండ్రియా భాభా ఆస్పత్రిలో చికిత్స పొందిందని అన్నారు. కారణం లేకుండా, తనను, తమ కుమారుడిపై కాంబ్లీ దుర్భాషలాడాడని ఇండ్రియా తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.

 

వినోద్ కాంబ్లికి 51ఏళ్లు. అతనికి వివాదాలు కొత్తకాదు. గతంలోనూ పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. తను నివాసముండే హౌసింగ్ సొసైటీలో గొడవ కారణంగా ముంబై పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలం క్రితం కాంబ్లీ మద్యం తాగి వాహనం నడుపుతూ వార్తల్లో వ్యక్తిగా మారాడు. అయితే, ఇటీవల కాలంలో ఆయన ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధను వ్యక్తం చేశాడు. తనకు సంపాదన లేదని, కేవలం బీసీసీఐ ఇస్తున్న పెన్షన్ పైనే ఆధారపడి జీవించాల్సి వస్తుందని తెలిపాడు. మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కు వినోద్ కాంబ్లీ మంచి స్నేహితుడు. వినోద్ కాంబ్లీకి ఆండ్రియా రెండో భార్య. వారికి 2010లో కుమారుడు జన్మించాడు.