Virat Kohli: వన్డేలకు కూడా కోహ్లీకి గుడ్ బై.. హింట్ ఇచ్చిన రవిశాస్త్రి

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్ కు కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తాడనే సంకేతాలిచ్చాడు మాజీ కోచ్ రవిశాస్త్రి.

Virat Kohli: వన్డేలకు కూడా కోహ్లీకి గుడ్ బై.. హింట్ ఇచ్చిన రవిశాస్త్రి

Virat Kohli

Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్ కు కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తాడనే సంకేతాలిచ్చాడు మాజీ కోచ్ రవిశాస్త్రి. ఐపీఎల్ ఆడుతున్న సమయంలోనే టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత షార్ట్ ఫార్మాట్ కు రిటైర్ అయిపోతానంటూ చెప్పాడు. అన్నట్లుగానే రిటైర్ అయిన కోహ్లీ.. వన్డే ఫార్మాట్ కు త్వరలోనే దూరం కానున్నాడట.

2017 నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ లతో పాటు హెడ్ కోచ్ గా రవిశాస్త్రి ఉన్నారు. ఓ ప్రముఖ ఇంగ్లీష్ మీడియాతో శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ రెడ్ బాల్ క్రికెట్ మీదే ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడని.. వన్డే కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పేస్తాడని అన్నాడు.

‘రెడ్ బాల్ క్రికెట్ లో ఐదేళ్లుగా ఇండియా వరల్డ్ నెం.1గా ఉంది. అతను కెప్టెన్ గా అలసిపోయాడు కాబట్టి రిటైర్మెంట్ ఇచ్చాడు. అదేదో వెంటనే జరిగిపోయిన విషయం కాదు. వన్డే ఫార్మాట్ లో కూడా అదే జరుగుతుంది. అతనికి టెస్ట్ ఫార్మాట్ మీద ఫోకస్ పెట్టాలని ఉంది. మానసికంగా, శారీరకంగా దానికి ఫిక్స్ అయిపోయాడు’ అని స్పష్టం చేశాడు.

……………………………………… : నీట మునిగిన తిరుపతి రుయా ఆసుపత్రి

దీనిని బట్టి కోహ్లీ టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడం వెనుక కారణం సాధారణమైనదేనంటూ తేల్చాడు. ‘కోహ్లీ ఒక్కడే కాదు. సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇచ్చి బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టిన పాత కెప్టెన్లు చాలా మంది ఉన్నారు’ అని అన్నాడు రవిశాస్త్రి.