సైకిల్ దొంగగా మారిన IPL మాజీ క్రికెటర్

సైకిల్ దొంగగా మారిన IPL మాజీ క్రికెటర్

కొన్నేళ్ల క్రితం హిట్లర్‌లా రెచ్చిపోయిన.. IPLలో కోట్లు పలికిన మాజీ క్రికెటర్ ల్యూక్ పోమర్‌బాచ్ సైకిల్ దొంగగా మారాడు. ఆస్ట్రేలియా మీడియా కథనం ప్రకారం.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరులకు ప్రాతినిధ్యం వహించిన ల్యూక్.. వ్యసనాలకు బానిస అయ్యాడు. జనవరిలో జరిగిన రెండు ఘటనల్లో నిందితుడిగా ఉండటంతో బుధవారం కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. 

ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగి ఉన్న రోజున షాపింగ్ సెంటర్ బయట సైకిల్ దొంగతనం చేశాడు. కొద్ది వారాల తర్వత లిక్కర్ షాప్ నుంచి 10 మందు ప్యాకెట్లు దొంగిలించినట్లు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పోమర్‌బాచ్ ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిథ్యం వహించి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ 4సీజన్ల పాటు 17 మ్యాచ్‌లు ఆడాడు. 

బిగ్ బాష్ లీగ్ లోనూ ఇతనికి మంచి పేరే ఉంది. చట్టపరంగా ఎప్పుడూ ఏదో సమస్య ఎదుర్కొంటూనే ఉన్నాడు. భారత్‌లో పర్యటిస్తున్న సందర్భంలో ఓ యువతి బాయ్‌ఫ్రెండ్‌పై దాడి చేశాడని ఆమె చేసిన ఫిర్యాదు మేరకు ఓ సారి అరెస్టు అయ్యాడు. 2014లో పలు రూమర్లు ఎదుర్కొని క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఒత్తిడితో పాటు ఇతర కారణాలతో వ్యసనానికి బానిసై డబ్బుల కోసం ఇటువంటి పనులు చేస్తున్నట్లు విచారణలో తేలింది. 

Read More>>ఎవరు ఎన్ని అనుకున్నా.. పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఉన్నది ఫ్యూర్ లవ్..