Asia Cup Controversy: భారత్ ఆడనంటే ఐసీసీ ఏం చేస్తుంది..? బీసీసీఐపై ఘాటు వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ క్రికెటర్

త్వరలో పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్ టోర్నీలో పాల్గొనేందుకు భారత్ జట్టు పాకిస్థాన్‌కు వచ్చేలా ఐసీసీ చూడాలని పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ అన్నారు. బీసీసీఐను నియంత్రించలేనప్పుడు పాలక మండలిగా ఐసీసీ ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

Asia Cup Controversy: భారత్ ఆడనంటే ఐసీసీ ఏం చేస్తుంది..? బీసీసీఐపై ఘాటు వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ క్రికెటర్

Pakistan vs Teamindia

Asia Cup Controversy: బీసీసీఐ, పీసీబీ మధ్య ఆసియా కప్ వివాదం ముగిసే సూచనలు కనిపించడం లేదు. త్వరలో పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌లో తాము పాల్గోబోమని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం విధితమే. పాకిస్థాన్‌లో భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా ఆటగాళ్లను ఆ దేశానికి పంపించలేమని బీసీసీఐ ఖరాఖండీగా తేల్చేసింది. పాక్‌లో కాకుండా ప్రత్యామ్నాయ దేశాల్లో టోర్నీ నిర్వహిస్తే భారత్ జట్టు పాల్గొంటుందని తెలిపింది. బీసీసీఐ నిర్ణయాన్ని  పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తప్పుబడుతుంది. మీరు ఆసియా కప్‌ను బహిష్కరిస్తే, మేం ఈ ఏడాది చివరిలో భారత్‌లో జరిగే వన్డే ప్రపంచ కప్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించింది.

Asia Cup 2023 : భారత్ పాకిస్తాన్‌కు వెళ్లదు.. పాక్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ బిగ్ షాక్

గత కొద్దికాలంగా ఆసియా కప్ విషయంలో భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ బీసీసీఐ‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేను ఎప్పటినుండో చెబుతూనే ఉన్నా. భారత జట్టు రాకపోతే మేము పట్టించుకోము, రాకపోతే వాళ్లే నరకానికి పోతా‌రు అంటూనే బీసీసీఐ పలు విమర్శలు చేశారు. భారత్ జట్టు పాకిస్థాన్ కు వచ్చేలా ఐసీసీ చూడాలన్నారు. బీసీసీఐను నియంత్రించలేనప్పుడు పాలక మండలిగా ఐసీసీ ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

Asia Cup 2023: పాకిస్థాన్‌లో ఆసియా కప్-2023 టోర్నీ.. టీమిండియా పాల్గొంటుందా.. బీసీసీఐ ఏమన్నదంటే?

బీసీసీఐ ప్రత్యేకం ఏమీ కాదని, ఐసీసీ నిబంధనలు ప్రతి జట్టుకు ఒకే విధంగా ఉంటాయని, వాటిని కచ్చితంగా ఐసీసీ అమలు చేయాలని జావేద్  అన్నారు. నిబంధనలు పాటించని పక్షంలో బీసీసీఐపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోవాలని జావెద్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్ కు భారత్ జట్టు రాకపోవటానికి మరోకారణం ఉందని, ఒకవేళ పాకిస్థాన్ లో భారత్ జట్టు ఓడిపోయితే అక్కడి ప్రజలు సహించరని, ఆ భయం బీసీసీఐను వెంటాడుతుందని జావేద్ అన్నారు.