WTC XI: ‘విరాట్ కోహ్లీని ఆ జట్టులో చేర్చడం చాలా కష్టం’

బ్రాడ్ హాగ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఎలెవన్ జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు కల్పించడం చాలా కష్టమని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అంటున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ గెలిచి న్యూజిలాండ్ ట్రోఫీ సొంతం చేసుకుంది. టోర్నీని ఇండియా రన్నరప్ గానే ముగించింది.

WTC XI: ‘విరాట్ కోహ్లీని ఆ జట్టులో చేర్చడం చాలా కష్టం’

Virat Kohli

WTC XI: బ్రాడ్ హాగ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఎలెవన్ జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు కల్పించడం చాలా కష్టమని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అంటున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ గెలిచి న్యూజిలాండ్ ట్రోఫీ సొంతం చేసుకుంది. టోర్నీని ఇండియా రన్నరప్ గానే ముగించింది.

వరల్డ్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ లో కోహ్లీ 15మ్యాచ్ లు ఆడి 934పరుగులు చేయగలిగాడు. 254పరుగుల వరకూ నాటౌట్ గా ఆడాడు. బ్రాడ్ హాగ్ జట్టులో చేర్చుకోవడానికి ఇటువంటి ప్రదర్శన సరిపోదని విమర్శించాడు.

అయితే ఈ జట్టులో రోహిత్ శర్మను ఓపెనర్ గా తీసుకుంటూ అతనికి పార్టనర్ శ్రీలంక ప్లేయర్ దిముత్ కరుణరత్నెను ఎంచుకున్నాడు. రోహిత్ ఆడిన 12మ్యాచుల్లో 1094పరుగులు చేసేశాడు.

రోహిత్ శర్మ టాపార్డర్ లో ఉన్నాడు. నాలుగు సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. భారత వాతావరణంలోనే ఎక్కువ పరుగులు చేయగలిగాడు. విదేశాల్లో స్కోరు చేయడం కొంచెం కష్టమే. బోర్డ్ మీద అన్ని పరుగులు ఉంచగలగడం చాలా కష్టం. అందుకే అతణ్ని కూడా జట్టులోకి తీసుకున్నా’ అంటూ యూట్యూబ్ వీడియోలో చెప్పుకొచ్చాడు.

మిగతా ప్లేయర్లుగా కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, బాబర్ అజామ్ మిడిలార్డర్ ప్లేయర్లుగా 3, 4, 5స్థానాల్లోకి ఎంపికయ్యారు. బెన్ స్టోక్స్ కు ఆరో స్థఆనం.. వికెట్ కీపర్ గా ఏడో స్థానంలో రిషబ్ పంత్ కు స్థానం దక్కింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మొహమ్మద్ షమీ లు కూడా స్థానం దక్కించుకున్నారు.

మొత్తం జట్టు ఇలా ఉంది:
1 రోహిత్ శర్మ, 2 దిముత్ కరుణరత్నే, 2 కేన్ విలియమ్సన్ , 4 స్టీవ్ స్మిత్, 5 బాబర్ అజామ్, 6 బెన్ స్టోక్స్, 7 రిషబ్ పంత్, 8 కైల్ జామిసన్, 9 రవిచంద్రన్ అశ్విన్, 10 స్టువర్ట్ బ్రాడ్, 11 మహ్మద్ షమీ. 12. మార్నస్ లాబుస్చాగ్నే