French Open: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జకోవిచ్

ఫ్రాన్స్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ 2021 పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ సీడ్ నోవాక్ జకోవిచ్ విజేతగా నిలిచాడు. హోరాహోరీగా ఫైనల్ పోరులో జకోవిచ్, సిట్సిపాస్ తలపడ్డారు.

French Open: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జకోవిచ్

French Open

French Open: Novak Djokovic : ఫ్రాన్స్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ 2021 పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ సీడ్ నోవాక్ జకోవిచ్ విజేతగా నిలిచాడు. హోరాహోరీగా ఫైనల్ పోరులో జకోవిచ్, సిట్సిపాస్ తలపడ్డారు. సిట్సిపాస్‌పై గెలిచి మరోసారి నెంబర్ వన్ గా నిలిచాడు.

జకోవిచ్ తన కెరీర్ లో 19సార్లు గ్రాండ్ స్లామ్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌లో ఐదో సీడ్ సిట్సిపాస్‌పై నోవాక్ జకోవిచ్ 6-7, 2-6, 6-3, 6-2, 6-4 తేడాతో గెలిచి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ దక్కించుకున్నాడు.

ఈ గెలుపుతో వింబుల్డన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌, యూఎస్ ఓపెన్ లలో కనీసం రెండుసార్లు గెలిచిన మొదటి ప్లేయర్‌గా జకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఒక్కో గ్రాండ్ స్లామ్‌ను రెండుసార్లు గెలిచిన ప్లేయర్‌గా జకోవిచ్ నిలిచాడు.

మరోవైపు.. ఫ్రెంచ్ ఓపెన్‌ మహిళల విభాగంలో చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్ బర్బోరా క్రిచికోవా విజేతగా నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచిన క్రిచికోవా.. డబుల్స్‌ విజేతగా అవతరించింది.

కేథరీనా సినియాకోవాతో జోడీగా క్రిచికోవా… ఫైనల్లో ఇగా స్వియాటెక్‌, బెతానీ మాటెక్‌ సాండ్స్‌ జోడీపై 6-4, 6-2తో గెలిచింది. ఫలితంగా 2000 సంవత్సరం తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఒకే ఏడాది సింగిల్స్‌, డబుల్స్‌ టైటిల్స్ సాధించిన మొదటి ప్లేయర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. చివరిసారిగా ఈ  ఫీట్‌ను 2000 ఏడాదిలో మేరీ పియర్స్‌ దక్కించుకుంది.