Special RTC Buses: మరికొద్ది సేపట్లో ఇండియా – ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. నగరంలోని 24 ప్రదేశాల నుంచి స్పెషల్ బస్సులు

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టీ20 మ్యాచ్ ఈరోజు రాత్రి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. అయితే అభిమానుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Special RTC Buses: మరికొద్ది సేపట్లో ఇండియా – ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. నగరంలోని 24 ప్రదేశాల నుంచి స్పెషల్ బస్సులు

Ts Gretar Rtc

Special RTC Buses: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టీ20 మ్యాచ్ ఈరోజు రాత్రి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. అయితే అభిమానుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్రికెట్ మ్యాచ్ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

India vs Australia T20 Match: నేడే ఇండియా – ఆస్ట్రేలియా చివరి టీ20 మ్యాచ్ .. నిర్ణయాత్మక పోరుకు సిద్ధమైన ఉప్పల్ స్టేడియం .. ప్రత్యేకతలు ఏమిటంటే?

నగరంలోని 24 ప్రదేశాల నుంచి ఉప్పల్ స్టేడియానికి ఆర్టీసీ బస్సులను నడిపించనున్నారు. క్రికెట్ మ్యాచ్ కు టికెట్లు దక్కించుకున్న వారు సొంత వాహనాల కంటే ఎక్కువగా పబ్లిక్ వాహనాలపై వచ్చి వెళ్లేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. సొంత వాహనాల్లో వస్తే పార్కింగ్ సమస్యతో పాటు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆందోళణ చెందుతుందన్నారు. ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది.

ఉప్పల్ రూట్‌, ఘట్కేసర్-రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, బిహెచ్.ఈఎల్ (BHEL), జీడిమెట్ల, కెపిహెచ్బి, మేడ్చల్, మియాపూర్, జేబీఎస్, ఈసిఐఎల్ క్రాస్ రోడ్స్, హయత్ నగర్, ఏన్.జి.ఓ కాలనీ, ఇబ్రహీంపట్నం, ల్యాబ్ క్వార్టర్స్, కోటి, దిల్ సుఖ్​ నగర్, ఆఫ్జల్ గంజ్, మెహదీపట్నం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం,యూసఫ్ గూడ, బోయిన్పల్లి, చార్మినార్, చంద్రయానగుట్ట, కొండాపూర్ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఈ ప్రత్యేక బస్సులు గ్రేటర్ ఆర్టీసీ అందుబాటులో ఉంచనుంది.