ఉదయం పిల్లాడినే.. తనొచ్చాక ఇంత ఎదిగిపోయా.. తానే నా భార్య

ఉదయం పిల్లాడినే.. తనొచ్చాక ఇంత ఎదిగిపోయా.. తానే నా భార్య

Virushka: క్రికెటర్ల ప్రేమ వివాహంలో ప్రజెంట్ జనరేషన్ కు గుర్తుండిపోయేలా.. మోస్ట్ లవబుల్ పెయిర్ గా ఫ్యామస్ అయింది విరుష్కా జోడీనే. కెరీర్ లో టాప్ పొజిషన్ కు చేరిన ఇద్దరు సెలబ్రిటీలు డిస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని ఒక్కటయ్యారు. 2017లో వైవాహిక బంధంలో అడుగుపెట్టని వీరి ప్రేమాయణం పలు మలుపులు తిరిగి సుఖాంతం అయింది. సందర్భం వచ్చిన ప్రతిసారి తన ప్రేమను బయటపెట్టే కోహ్లీ-అనుష్కల వైవాహిక మూడో వార్షికోత్సవం సందర్భంగా టీజర్ లాంటి ఓ పాటను విడుదల చేశారు.

డిసెంబరు 11న ఈ జంట మూడో వార్షికోత్సవం సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటూ ట్వీట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చేసిన ట్వీట్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. ‘మూడేళ్ల మన బంధం.. త్వరలోనే ముగ్గురిగా మారబోతున్నాం’ అంటూ తల్లి కాబోతున్న సంతోషాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది అనుష్క. దానికి నెటిజన్లు, విరుష్కా అభిమానులు అమితమైన స్పందన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్ ఇలా ఉంది. ‘పీరు వి తూ’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో పాట ప్లే అవుతుండగా.. అనుష్క ఎంట్రీ ఇవ్వగానే.. ‘నా భార్య.. మళ్లీ చెప్పనా తానే నా భార్య.. ఉదయం వరకు చిన్నపిల్లాడిగానే ఉన్నా.. ఇప్పుడే ఇంతగా ఎదిగిపోయా.. తానే నా భార్య’ అని కోహ్లి మాట్లాడిన మాటలతో వీడియో కనిపిస్తుంది.

వారి మాధుర్య బంధాన్ని ప్రతిబింబించే ఫీలింగ్స్‌ను క్యాప్చర్ చేసి మనసులకు హత్తుకునేలా ఉన్న వీడియో అందరినీ ఆకట్టుకోకమానదు. కేవలం టీజర్‌లా ఉన్న ఆ పాటకు సంబంధించి పూర్తి వీడియో కూడా విడుదలైంది. హర్ష్‌దీప్‌ కౌర్‌, మోహన్‌ కన్నన్‌ ఆలపించిన పాటను యూట్యూబ్‌లో డిసెంబర్ 17న విడుదల చేశారు.