Sourav Ganguly Exiting BCCI: బీజేపీలో చేరనందుకే బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీని తొలగిస్తున్నారా? బీజేపీ, టీఎంసీ మధ్య ట్విటర్ వార్..

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ పాత్ర దాదాపు ముగిసినట్లే కనిపిస్తుంది. గత మూడేళ్లుగా భారత క్రికెట్లో చక్రం తప్పిన గంగూలీకి బీసీసీఐ అధ్యక్ష స్థానం నుంచి తప్పుకొనేందుకు తేదీ ఖరారైంది. అయితే ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటుంది. గంగూలీని కావాలనే బీజేపీ తప్పిస్తుందని టీఎంసీ నేతలు ఆరోపిస్తుండగా, బీజేపీ మాత్రం టీఎంసీ కావాలనే రాజకీయం చేయాలని చూస్తుందని ఎదురుదాడి చేసింది.

Sourav Ganguly Exiting BCCI: బీజేపీలో చేరనందుకే బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీని తొలగిస్తున్నారా? బీజేపీ, టీఎంసీ మధ్య ట్విటర్ వార్..

Sourav Ganguly

Sourav Ganguly Exiting BCCI: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ పాత్ర దాదాపు ముగిసినట్లే కనిపిస్తుంది. గత మూడేళ్లుగా భారత క్రికెట్లో చక్రం తప్పిన గంగూలీకి బీసీసీఐ అధ్యక్ష స్థానం నుంచి తప్పుకొనేందుకు తేదీ ఖరారైంది. కర్ణాటకకు చెందిన 1983 ప్రపంచ‌కప్ హీరో రోజర్ బిన్నీ బీసీసీఐ తదుపరి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 18న ముంబయిలో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా బిన్నీ అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. అయితే ఐసీసీ చైర్మన్‌గా గంగూలీ ఎంపికవుతారని భావించినప్పటికీ అది సాధ్యకానట్లే కనిపిస్తోంది.

BCCI President: బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా టీమిండియా మాజీ పేసర్ రోజర్ బిన్నీ?

మరోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగేందుకు గంగూలీ ఆసక్తి చూపినప్పటికీ బోర్డు అందుకు తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ కావాలనే గంగూలీని పక్కకు పెడుతుందని పశ్చిమ బెంగాల్ కు చెందిన టీఎంసీ (తృణమూల్ కాంగ్రెస్ పార్టీ) సభ్యులు ఆరోపించారు. సౌరవ్ గంగూలీని బీజేపీలో చేరనందుకే బీసీసీఐ అధ్యక్షుడిగా రెండోసారి ఆయనకు నిరాకరించడం నిజంకాదా? అంటూ తృణమూల్ కాంగ్రెస్ మంగళవారం ప్రశ్నించింది. సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీని బీసీసీఐ అధ్యక్షుడిగా నియమిస్తారని రాజీవ్ శుక్లా ధృవీకరించిన తర్వాత ఈ ఆరోపణ వచ్చింది.

India vs South Africa ODI Series: వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. ట్రోపీ అందుకొని తొడగొట్టిన శిఖర ధావన్.. ట్విటర్‌లో వీడియో పోస్టు చేసిన బీసీసీఐ

అమిత్ షా కుమారుడిని బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగించవచ్చు.. కానీ సౌరవ్ గంగూలీ మాత్రం ఎందుకు కొనసాగించరు అంటూ టీఎంసీ నేతలు ప్రశ్నించారు. అతను మమతా బెనర్జీ రాష్ట్రం( పశ్చిమ బెంగాల్)కు చెందినవాడు కాబట్టి. లేక బీజేపీలో చేరలేదనా? అని టీఎంసీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ శాంతను సేన్ ట్వీట్ చేశారు. భారత మాజీ కెప్టెన్‌ను అవమానపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ఆరోపించారు.

Sourav Ganguly, Jay Shah: జై షా, సౌరవ్ గంగూలీకి సుప్రీంకోర్టు ఊరట.. పదవుల్లో తిరిగి కొనసాగేలా తీర్పు

టీఎంసీ నేతల వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించినప్పుడు తృణమూల్ పాత్ర ఏమైనా ఉందా? అంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోస్ ప్రశ్నించారు. గంగూలీని ఎప్పుడు పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ ప్రయత్నించిందో మాకు తెలియదు. ఆ ప్రయత్నం బీజేపీ ఎప్పుడూ చేయలేదని ఖచ్చితంగా నేను చెప్పగలను అని అన్నారు. సౌరవ్ గంగూలీ క్రికెట్ లెజెండ్ అని, కొందరు ఇప్పుడు బీసీసీఐలో మార్పులపై మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ పరోక్షంగా టీఎంసీ నేతల వ్యాఖ్యలను దిలీప్ ఘోస్ తిప్పికొట్టాడు.