గంగూలీని ఏడిపించొద్దంటోన్న సెహ్వాగ్

గంగూలీని ఏడిపించొద్దంటోన్న సెహ్వాగ్

టీమిండియాలో సంచలనం… అప్పటివరకూ ట్రిపుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్ లేడు. తొలి సారి పాకిస్తాన్ గడ్డపై 531 నిమిషాల పాటు 375 బంతులు ఎదుర్కొని 39 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 309 పరుగులు పూర్తి చేశాడు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. 

సరిగ్గా 15ఏళ్ల క్రితం మార్చి 29న 2004లో వీరేంద్ర సెహ్వాగ్.. ట్రిపుల్ సెంచరీ బాదాడు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశాడు. ముందుగా తాను చేసిన ట్రిపుల్ సెంచరీకి 15ఏళ్లు నిండాయని వీరూ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. 
Read Also : లాజిక్ లెక్కలు.. గుడ్డు.. ఫన్నీ జోక్స్ : విమానంలో చెన్నై టీం హంగామా

’29 మార్చి- ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకమైంది. ఈ రోజున టెస్టు క్రికెట్‌లో 300పరుగులు సాధించిన భారత తొలి క్రికెటర్‌గా నిలిచాను. మళ్లీ నాలుగేళ్లకి దక్షిణాఫ్రికా మీద 319పరుగులు సాధించగలిగాను’ అని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌పై దాదా స్పందించాడు. ‘భారత తరపున ఉన్న ఇద్దరు గ్రేటెస్ట్ ఓపెనర్లలో.. వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు’ అని ట్వీట్ చేశాడు. 

గంగూలీ ట్వీట్‌కు సెహ్వాగ్.. ‘దాదా.. ఏడిపిస్తావా ఏంటి! గ్రేట్ కెప్టెన్‌లు ప్లేయర్లను బెటర్‌ చేస్తారు. థాంక్యూ దాదా’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. మరో వైపు వీరేంద్ర సెహ్వాగ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్ పదవి నుంచి రాజీనామా ఇచ్చేశాడు. 

Read Also : భ్రష్టు పట్టిస్తోంది : ఏంటీ ‘Bigo Live’.. మాయలో కుర్రోళ్లు