గంగూలీకి ఢిల్లీ మీద గట్టి నమ్మకమే ఉంది: పాంటింగ్

ఇద్దరూ కలిసి ఒకే ఫ్రాంచైజీకి పని చేయడం అటుంచితే.. ఇద్దరి ప్రధాన ఉద్దేశ్యం ఢిల్లీ జట్టుని గెలిపించడమే.

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 09:13 AM IST
గంగూలీకి ఢిల్లీ మీద గట్టి నమ్మకమే ఉంది: పాంటింగ్

ఇద్దరూ కలిసి ఒకే ఫ్రాంచైజీకి పని చేయడం అటుంచితే.. ఇద్దరి ప్రధాన ఉద్దేశ్యం ఢిల్లీ జట్టుని గెలిపించడమే.

క్రికెట్ కెరీర్‌లో పాంటింగ్.. గంగూలీ ప్రత్యర్థులు. ఆసీస్ కెప్టెన్‌గా రిక్కీ పాంటింగ్.. టీమిండియా కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ ఉన్న సమయంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే.. భారీ అంచనాలు ఉండేవి. ఆ స్థాయిలో ఉండేది వారిద్దరి మధ్య పోటీ. కానీ, వాళ్లిద్దరినీ ఐపీఎల్‌లోని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒక్కటి చేసింది. 

ఇద్దరూ కలిసి ఒకే ఫ్రాంచైజీకి పని చేయడం అటుంచితే.. ఇద్దరి ప్రధాన ఉద్దేశ్యం ఢిల్లీ జట్టుని గెలిపించడమే. గంగూలీ సలహాదారుగా ఉంటే పాంటింగ్ కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం కోల్‌కతా వేదికగా నైట్ రైడర్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీ జట్టు ప్రాక్టీస్ సమయంలో అక్కడే ఉన్న గంగూలీ వారికి విలువైన సలహాలిచ్చాడు. 

ఈ సందర్భంగా మ్యాచ్ విజయం పట్ల.. ఐపీఎల్ ట్రోఫీ సమరంలోనూ ఢిల్లీ క్యాపిటల్స్ గట్టి పోటీనివ్వగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గంగూలీకి జట్టుపై ఉన్న నమ్మకాన్ని పాంటింగ్ మీడియా వేదికగా తెలిపారు. ‘నాకు గంగూలీతో కలిసి పనిచేయడం చాలా ఇష్టం. సౌరవ్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుందని బాగా కుతూహలంగా కనిపిస్తున్నాడు. సీజన్‌ను బాగానే ఆరంభించాం. ఇంకా మంచి క్రికెట్ ఆడి కొన్ని వారాల్లో గట్టి మార్పులు చూపిస్తాం’ అని పాంటింగ్ ముగించాడు. 
Read Also : మొబైల్, వెబ్ వెర్షన్ : ‘Jio News’ యాప్ వచ్చేసింది