Pakistan Coach: పాకిస్తాన్ కోచ్‌గా టీమిండియా మాజీ హెడ్ కోచ్

టీ20 ప్రపంచ కప్ 2021 టోర్నీలో దూసుకుపోతున్న పాకిస్తాన్ జట్టుపైనే అందరి కళ్లు ఉన్నాయి. టీమిండియా, న్యూజిలాండ్ వంటి ఫేవరేట్ జట్లను భారీ తేడాతో చిత్తు చేస్తూ.. ప్రశంసలు అందుకుంటోంది.

10TV Telugu News

Pakistan Coach: టీ20 ప్రపంచ కప్ 2021 టోర్నీలో దూసుకుపోతున్న పాకిస్తాన్ జట్టుపైనే అందరి కళ్లు ఉన్నాయి. టీమిండియా, న్యూజిలాండ్ వంటి ఫేవరేట్ జట్లను భారీ తేడాతో చిత్తు చేస్తూ.. ప్రశంసలు అందుకుంటోంది. కొన్నేళ్లుగా విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ జట్టు.. టోర్నీకి ముందు భారీ మార్పులు చేసుకుని అడుగుపెట్టింది.

ఈ క్రమంలోనే హెడ్‌ కోచ్‌ మిస్బా ఉల్‌ హక్‌ సహా బౌలింగ్‌ కోచ్‌ వఖార్‌ యూనిస్‌ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మెగా ఈవెంట్‌ ఆరంభానికి ముందే తీసుకున్న ఈ నిర్ణయంపై పీసీబీ సందిగ్దంలో పడింది. సక్లెయిన్‌ ముస్తఖ్‌ను తాత్కాలిక హెడ్‌కోచ్‌గా నియమించి విదేశీ కోచ్‌కు ఈ బాధ్యతలు అప్పజెప్పాలని పీసీబీ చైర్మన్‌ రమీజ్‌ రాజా భావిస్తున్నారు.

టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా సేవలు అందించిన సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టన్‌ పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మిస్బా స్థానాన్ని కిర్‌స్టన్‌తో భర్తీ చేసేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అతనితో పాటు సైమన్‌ కటిచ్(ఆస్ట్రేలియా)‌, పీటర్‌ మూర్స్‌(ఇంగ్లాండ్‌) పేర్లు కూడా తెరమీదకొచ్చాయి.

 

……………………………………………… : వయసుతో పనిలేదు.. ఊపొస్తే ఊపాల్సిందే..

గ్యారీ కిర్‌స్టన్‌ 2008-2011 మధ్య కాలంలో టీమిండియా ప్రధాన శిక్షకుడిగా వ్యవహరించాడు. ఎంఎస్‌ ధోని కెప్టెన్‌గా ఉన్న అదే సమయంలో టీమిండియా 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచింది. 3 దశాబ్దాల నిరీక్షణ తర్వాత జగజ్జేతగా నిలిచింది. కిర్‌స్టన్‌ కోచ్‌గా ఉన్నపుడే టీమిండియా టెస్టు ఫార్మాట్‌లోనూ నంబర్‌ 1 ర్యాంకుకు చేరుకుంది.

కిర్‌స్టన్‌ రికార్డులిలా:
185 వన్డేలు, 101 టెస్టులు ఆడాడు. వన్డేల్లో 6798, టెస్టుల్లో 7289 పరుగులు బాదాడు. 2004లో ప్రొటిస్‌ జట్టు తరఫున చివరి మ్యాచ్‌ ఆడి క్రికెటర్ గా కెరీర్ కు వీడ్కోలు పలికాడు.