IPL 2023: గౌతం గంభీర్‌ను పొగుడుతూ కోహ్లీ ఫ్యాన్స్‌కి మళ్లీ చిరాకు తెప్పించిన నవీన్ ఉల్ హక్

లక్నో మెంటార్ గంభీర్ గురించి నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Naveen-ul-Haq: గౌతం గంభీర్ (Gautam Gambhir) ఓ లెజెండ్ అని, ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఆటగాడు, అఫ్గాన్ క్రికెటర్ నవీన్-ఉల్-హక్ అన్నాడు. ఆర్సీబీ (RCB) బ్యాటర్ విరాట్ కోహ్లీతో ఐపీఎల్-2023లో ఈ నెల 1న లక్నో, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ సమయంలో నవీన్ ఉల్ హక్, గంభీర్ గొడవ పడ్డ విషయం తెలిసిందే.

ఇటువంటి సమయంలో లక్నో మెంటార్ గంభీర్ గురించి నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ ను పొగడడంతో కోహ్లీ ఫ్యాన్స్ మళ్లీ నవీన్-ఉల్-హక్ పై చిరాకు పడుతున్నారు. అతడిపై ట్రోల్స్ తో రెచ్చిపోతున్న ఫ్యాన్స్ ఇప్పుడు మరింత మండిపడుతున్నారు.

“మెంటార్, కోచ్, ఆటగాడు, ఎవరైనా సరే… మైదానంలో నేను వారికి మద్దతుగా నిలుస్తాను. అందరి నుంచీ నేను అదే కోరుకుంటాను. గంభీర్ కు భారత్ లో చాలా గౌరవం ఉంది. భారత క్రికెట్ కు ఆయన ఎంతో మంచి చేశాడు. కోచ్ గా, మెంటార్ గా, క్రికెట్ లెజెండ్ గా ఆయనను నేను చాలా గౌరవిస్తాను. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను” అని నవీన్-ఉల్-హక్ తాజాగా వ్యాఖ్యానించాడు.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ చాలాబాగా జరిగిందని, తమ జట్టు మరింత బాగా రాణిస్తే బాగుండేదని అన్నాడు. వ్యక్తిగత ఆటతీరు ముఖ్యం కాదని, ట్రోఫీని గెలవడమే జట్టు లక్ష్యమని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ నుంచి చాలా నేర్చుకున్నానని, మరింత సమర్థవంతమైన ఆటగాడిగా మళ్లీ ఆడతానని చెప్పాడు.

IPL 2023: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్.. ఈ రికార్డు ఇక ఎప్పుడు బద్ధలవుతుందో..

ట్రెండింగ్ వార్తలు