‘ఢిల్లీలో కాలుష్యం పెరిగింది ధోనీ వల్లే’

‘ఢిల్లీలో కాలుష్యం పెరిగింది ధోనీ వల్లే’

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మరోసారి నోరుజారి నెటిజన్ల చేతికి అడ్డంగా దొరికిపోయాడు. ఇటీవల తన అధికారిక ట్విట్టర్ ద్వారా 2011వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోని ఓ ఘటన గురించి కామెంట్ చేశాడు. శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుండగా నేను 97పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా ధోనీ నా వద్దకు వచ్చాడు. నువ్వు సెంచరీ చేయడానికి ఇంకా మూడు పరుగులు మాత్రమే చేయాల్సి ఉందని చెప్పాడు.  

దాంతో ఒత్తిడికి గురై తిసారా పెరీరా బౌలింగ్ లో అవుట్ అయ్యానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్ లో వీరేంద్ర సెహ్వాగ్(0), సచిన్ టెండూల్కర్(18) పరుగుల వద్ద అవుట్ అవడంతో విరాట్ కోహ్లీ(35), ధోనీలు కాసేపటి వరకూ జట్టును నడిపించారు. కోహ్లీ తర్వాతి స్థానంలో వచ్చిన గంభీర్ తో కలిసి 107పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

గౌతం తన సెంచరీ మిస్ అయిపోవడానికి ధోనీనే కారణమని చెప్పడంతో మహీ అభిమానులతో పాటు నెటిజన్లు గౌతీపై మండిపడుతున్నారు. ఇదెలా ఉందంటే విలేకరి ఢిల్లీ కాలుష్యం గురించి మాట్లాడమని అడిగితే ధోనీ కెప్టెన్ గా 2011వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గెలిచినప్పుడు ఢిల్లీలో టపాసులు కాల్చారు. అందుకే కాలుష్యం పెరిగిపోయిందంటాడని గౌతీపై విమర్శలు గుప్పిస్తున్నారు.