Rishabh Pant: కొంచెమైనా బాధ్యత ఉండాలి కదా.. పంత్!!

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్ లలో బుధవారం మూడో రోజు గేమ్ లో భారత్ కు శుభారంభమే దక్కింది. చతేశ్వర్ పూజారా, అజింకా రహానెల సెంచరీ...

Rishabh Pant: కొంచెమైనా బాధ్యత ఉండాలి కదా.. పంత్!!

Rishab Pant

Rishabh Pant: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్ లలో బుధవారం మూడో రోజు గేమ్ లో భారత్ కు శుభారంభమే దక్కింది. చతేశ్వర్ పూజారా, అజింకా రహానెల సెంచరీ భాగస్వామ్యం జట్టుకు ఊతమిచ్చింది. ఒత్తిడిలోనూ పూజారా, రహానెలు దక్షిణాఫ్రికా ఫేస్ అటాక్ ను ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు కగిసో రబాడ ఈ పార్టనర్ షిప్ ను బ్రేక్ చేశాడు.

రహానె అవుట్ అవకముందు 58పరుగుల వరకూ నమోదుచేశాడు. ఆ తర్వాత రబాడ.. పూజారాను 53 పరుగులకే పంపించేశాడు. అంత ఇత్తిడి సమయంలో బరిలోకి దిగిన హనుమ విహారీ, రిషబ్ పంత్ పైనే బాధ్యతలు పడ్డాయి. పంత్ కూడా రబాడ బౌలింగ్ లోనే పెవిలియన్ బాటపట్టాడు. కీలక సమయాల్లో నిలబడి స్కోరు చేయగల పంత్ అలా అవుట్ అయిపోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ రెస్పాండ్ అయ్యారు.

‘ఆ షాట్ ను ఒప్పుకోవడానికి లేదు. అతని నేచురల్ గేమ్ లానే ఉంది. కాకపోతే కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. రబాడ బౌలింగ్ ఎదుర్కోవడానికి రహానె, పూజారాలు ఎంత కష్టపడ్డారు. పంత్ విషయంలో అలా జరగలేదు’ అని గవాస్కర్ కామెంట్ చేశారు.