India vs Australia T20 match: మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు వెళ్తున్నారా? మీ వాహనం ఎక్కడ పార్కింగ్ చేయాలంటే..

భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ మరికొద్ది సేపట్లో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ వీక్షించేందుకు సొంత వాహనాలపై స్టేడియంకు వచ్చిన వారు తమ వాహనాలకు కేటాయించిన పార్కింగ్ లో నిలపాల్సి ఉంటుంది. వాహనాల కోసం 21 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు.

India vs Australia T20 match: మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు వెళ్తున్నారా? మీ వాహనం ఎక్కడ పార్కింగ్ చేయాలంటే..

Parking

India vs Australia T20 match: భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ మరికొద్ది సేపట్లో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. హైదరాబాద్ నగరంలో మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరగనుండడంతో.. అభిమానులకు టీ20 ఫీవర్ పట్టుకుంది. రాత్రి 7గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. 4 గంటల నుంచే గ్రౌండ్ లోకి అనుమతించనున్నారు. మ్యాచ్ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయడంతో పాటు, 300 నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రౌండ్‌లో కూర్చున్న ప్రతీ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసుకునేలా ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు.

మ్యాచ్ వీక్షించేందుకు సొంత వాహనాలపై స్టేడియంకు వచ్చిన వారు తమ వాహనాలకు కేటాయించిన పార్కింగ్ లో నిలపాల్సి ఉంటుంది. వాహనాల కోసం 21 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు.

– హబ్సిగూడ నుంచి ఉప్పల్ రోడ్‌లో ఏక్‌మినార్ ఎడమవైపు నిలపవచ్చు.

– ఉప్పల్ – హబ్సిగూడ వైపు వచ్చే వాహనదారులు  జెన్ పాక్ట్ సర్వీసెస్ రోడ్, హిందూ ఆఫీసు, మెట్రో రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రదేశాల్లో మీ వాహనాలను నిలపాలి.

– ఉప్పల్ – రామంతాపూర్ వైపు వచ్చేవారు రామంతాపూర్ – ఉప్పల్ వైపు ఉన్న సినీ పొలిస్, మోడ్రన్ బేకరీ, శక్తి డిటర్జెంట్, డీఎస్ఎల్, అవెయా, ఇంటర్నేషనల్ స్కూల్ (చర్చి) ప్రదేశాల్లో పార్కింగ్ చేయొచ్చు.

– సాయంత్రం 4గంటల నుంచి ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.

– టికెట్లు ఉన్నవారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని పోలీసులు విజ్ఙప్తి చేశారు.

– అదేవిధంగా టికెట్లు ఉన్నవారు గ్రౌండ్ లోకి వెళ్లేందుకు ప్రత్యేక గేట్ లను ఏర్పాటు చేశారు.

– స్టేడియంలో మొత్తం 12 గేట్లు ఉన్నాయి. వీటిలో10, 12 వ గేట్లు మూసివేసి ఉంచుతారు. 4 నుంచి 9 గేట్లలో ప్రేక్షకులకు అనుమతి ఇస్తారు.

– గేట్ నవంబర్ -1 నుంచి ఆటగాళ్లు,  కొంతమంది ప్రముఖులకు మాత్రమే అనుమతి ఇస్తారు.

– గేట్ నవంబర్ 2 నుంచి హెఎచ్‌సీయూ ప్రతినిధులు, మీడియా, పోలీసులకు అనుమతి ఉంటుంది.