Group-2 Scenarios: తాలిబన్ల దేశం గెలవాలని కోరుకుంటున్న భారత్.. ఎందుకో తెలుసా?

తాలిబన్ల దేశం గెలవాలని భారత్ కోరుకుంటుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది.

Group-2 Scenarios: తాలిబన్ల దేశం గెలవాలని కోరుకుంటున్న భారత్.. ఎందుకో తెలుసా?

Afghan

Group-2 Scenarios: తాలిబన్ల దేశం గెలవాలని భారత్ కోరుకుంటుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. యావత్ భారతదేశం ఇప్పుడు తాలిబాన్ల దేశం అఫ్ఘానిస్తాన్ టీ20 ప్రపంచకప్‌లో గెలవాలని కోరుకుంటుంది. T20 ప్రపంచకప్‌-2021లో గ్రూపు-2లో సెమీ ఫైనల్‌ బెర్తు కోసం భారత్ ఇంకా ఆశలు పెట్టుకునే ఉంది.. భారత్ ఆశలు సజీవింగా ఉండడానికి కారణం లేకపోలేదు. ఈ ఏడాది తాలిబాన్ల దేశం అఫ్ఘానిస్తాన్.. గతంలో కంటే మెరుగ్గా క్రికెట్‌లో రాణిస్తుంది.

ఈ క్రమంలో న్యూజిలాండ్‌, అఫ్ఘానిస్తాన్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది సెకండ్ గ్రూపు నుంచి పాకిస్తాన్‌ నాలుగింట నాలుగు విజయాలతో సెమీస్‌ చేరుకోగా.. భారత్, న్యూజిలాండ్, అఫ్ఘానిస్తాన్ మూడు జట్లు మాత్రం ఇతర జట్ల గెలుపోటములు, రన్‌రేటుపై ఆధారపడి ముందుకు పోయే పరిస్థితి ఉంది. కివీస్‌ జట్టు మూడు మ్యాచ్‌లలో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఆరు పాయింట్లతో ఉంది.

అఫ్ఘానిస్తాన్, ఇండియా మాత్రం చెరో రెండు విజయాలతో నాలుగేసి పాయింట్లు ఖాతాలో వేసుకుని మూడు, నాలుగు స్థానాల్లో నిలబడ్డాయి. ఈ రెండు జట్లతో పోలిస్తే రన్‌రేట్‌లో కివీస్‌ కాస్త వెనుకబడినా.. అఫ్ఘాన్‌తో రేపు(7 నవంబర్ 2021) మ్యాచ్‌‍లో గెలిస్తే చాలు ఎటువంటి సమీకరణాల్లేకుండా సెమీస్‌కి వెళ్లిపోతుంది. దీంతో భారత్ ఇంటి బాట పట్టక తప్పదు.

పాకిస్తాన్‌తో 10వికెట్ల ఓటమి.. న్యూజిలాండ్‌తో 8వికెట్ల ఓటిమి తర్వాత అఫ్ఘాన్‌.. స్కాట్లాండ్‌లపై భారీ విజయాలను నమోదు చెయ్యడంతో రన్‌రేట్ కూడా మెరుగుపడింది. ప్రస్తుతం టీమిండియా రన్‌రేటు +1.619గా ఉండగా.. అఫ్ఘానిస్తాన్ కంటే మెరుగైన స్థానంలో నిలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

అయితే, న్యూజిలాండ్‌ను అఫ్ఘానిస్తాన్ ఓడిస్తేనే భారత్‌కు సెమీస్ చేరుకునే ఛాన్స్ ఉంటుంది. నవంబరు 8న నమీబియాతో మ్యాచ్‌ భారత్‌కు అంత కష్టమేం కాదు.. కచ్చితంగా గెలుస్తుంది. అయితే, అంతకుముందు న్యాజిలాండ్‌తో మ్యాచ్‌లో తాలిబాన్ల దేశం అఫ్ఘానిస్తాన్‌ కచ్చితంగా గెలిచి తీరాలి.

అఫ్ఘానిస్తాన్‌కు మాత్రం సెమీస్ చేరుకునే అవకాశాలు చాలా తక్కువ.. న్యూజిలాండ్‌పై ఒకవేళ గెలిచినా కూడా భారత్ నమీబియా చేతిలో ఓటమి పాలవ్వాలి. అది అసలు జరిగే అవకాశమే లేదు. కాబట్టి అఫ్ఘాన్ సెమీస్‌ చేరలేదు.