IPL 2023: ఐపీఎల్ టోర్నీ నుంచి గుజరాత్ టైటాన్స్‌ జట్టు కీలక ప్లేయర్ ఔట్ ..

గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం మినీ వేలంలో రూ. 2కోట్లకు కేన్ విలియమ్సన్‌ను దక్కించుకుంది. గత ఏడాది ఐపీఎల్ విజేత జట్టుగా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు కేన్ విలియమ్సన్ మిడిలార్డర్‌లో కీలక బ్యాటర్‌గా మారుతాడని జట్టు భావించింది.

IPL 2023: ఐపీఎల్ టోర్నీ నుంచి గుజరాత్ టైటాన్స్‌ జట్టు కీలక ప్లేయర్ ఔట్ ..

IPL 2023

IPL 2023: ఐపీఎల్ 2023  (IPL 2023) ఆరంభంలోనే గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టులో కీలక ఆటగాడు కేన్ విలియమ్సన్  (Kane Williamson) టోర్నీలోని మిగిలిన మ్యాచ్‌ల నుంచి వైదొలిగాడు. ఈ మేరకు గుజరాత్ టైటాన్స్ ప్రకటన విడుదల చేసింది. గత నెల 31న ఐపీఎల్ 16వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కీలక ఆటగాడు కేన్ విలియమ్స్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో విలియమ్సన్ టోర్నీలోని మిగిలిన మ్యాచ్‌లలో ఆడే అవకాశం లేకపోవటంతో జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.

IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ఏఏ తేదీల్లో, ఏఏ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయో తెలుసా?

ఐపీఎల్ 2023 ఆరంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడిన విషయం విధితమే. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అయితే, తొలుత గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్‌కు దిగింది. ఫీల్డింగ్ చేసే సమయంలో కేన్ గాలికి గాయమైంది. వెంటనే గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయిన విలియమ్సన్ ఆ తరువాత గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్ సమయంలోనూ క్రీజులోకి రాలేదు. కేన్ స్థానంలో సాయి సుదర్శన్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా జట్టు యాజమాన్యం ఎంపిక చేసుకొని బ్యాటింగ్‌కు పంపించింది. కేన్ విలియమ్స్ గాయంపై గుజరాత్ టైటాన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. గాయం కారణంగా టోర్నీలోని మిగిలిన మ్యాచ్ లకు విలియమ్సన్ అందుబాటులో ఉండరని తెలిపింది. అయితే, త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని జట్టు యాజమాన్యం పేర్కొంది.

IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో సేవల సమయం పెంపు.. 60 ప్రత్యేక బస్సులు ..

గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం మినీ వేలంలో రూ. 2కోట్లకు కేన్ విలియమ్సన్ ను కొనుగోలు చేసింది. గత ఏడాది ఐపీఎల్ విజేత జట్టుగా బరిలోకి దిగుతున్న గుజరాత్ టైటాన్స్ కు కేన్ విలియమ్సన్ మిడిలార్డర్ లో కీలక బ్యాటర్ గా మారుతారని జట్టు భావించింది. రాబోయే మ్యాచ్‌లలో విలియమ్సన్ స్థానంలో యాజమాన్యం సాయి సుదర్శన్ నే జట్టు‌లో కొనసాగిస్తుందా, లేక కొత్త వారిని జట్టులోకి తీసుకుంటుందా అనేది చూడాలి. విలియమ్సన్ స్థానంలో స్టీవ్ స్మిత్‌ను జట్టులోకి తీసుకోవాలని గుజరాత్ టైటాన్ యాజమాన్యం తొలుత భావించినట్లు వార్తలు వచ్చాయి. స్మిత్ ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీలో ఏ జట్టులోనూ లేడు. అయితే, నిబంధనల ప్రకారం..  స్మిత్‌ను తీసుకోవటం వీలవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.