Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు షాక్.. మ్యాచ్ గెలిచామన్న ఆనందం లేకుండా పోయిందే
గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో విజయం సాధించామన్న ఆనందం కాసేపైనా పాండ్యా(Hardik Pandya)కు లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ నమోదు చేసినందుకు పాండ్యా మ్యాచ్ ఫీజులో రూ.12లక్షల జరిమానాను విధించారు.

Hardik Pandya
Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్‌లో మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆఖరి బంతి వరకు నువ్వా-నేనా అన్న రీతిలో తలపడుతున్నారు. దీంతో ఎవరు గెలుస్తారో అంచనా వేయడం సాధ్యం కావడం లేదు. బ్యాటర్లు విరుచుకుపడుతుండడంతో ఆఖరి ఓవర్లలో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలి, ఫీల్డింగ్ ఎక్కడ సెట్ చేసుకోవాలన్న దానిపై ఆయా జట్ల కెప్టెన్లు తర్జన భర్జన పడుతున్నారు. దీంతో సమయం వృధా అవుతుంది. మూడు గంటల్లో ముగియాల్సిన మ్యాచులు కాస్త ఆలస్యమవుతున్నాయి. దీంతో నిర్ణీత సమయంలో ఇన్నింగ్స్‌ను పూర్తి చేయని కెప్టెన్లకు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానాలు విధిస్తున్నారు.
గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో విజయం సాధించామన్న ఆనందం కాసేపైనా పాండ్యా(Hardik Pandya)కు లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ నమోదు చేసినందుకు పాండ్యా మ్యాచ్ ఫీజులో రూ.12లక్షల జరిమానాను విధించారు. “స్లో ఓవర్ రేటుకు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో తొలి సారి గుజరాత్ జట్టు స్లో ఓవర్ నమోదు చేయడంతో ఆ జట్టు కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాకు రూ.12లక్షల ఫైన్‌ను విధించినట్లు” నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
IPL 2023, PBKS vs GT: గిల్ అర్ధశతకం.. గుజరాత్ టైటాన్స్ విజయం
రెండో సారి కూడా ఇలాగే జరిగితే అప్పుడు జరిమానా మొత్తం రూ.24లక్షలకు పెరగనుంది. అంతేకాదు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో రూ.6లక్షలు లేదా 24 శాతం వరకు జరిమానా పడొచ్చు. మూడోసారి కూడా ఇలాగే జరిగితే కెప్టెన్ ఓ మ్యాచ్ నిషేదాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది. జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు రూ.12లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50శాతం జరిమానా విధిస్తారు. ఈ సీజన్‌లో స్లో ఓవర్ కారణంగా జరిమానా పడిన మూడో కెప్టెన్‌గా పాండ్యా నిలిచాడు. ఇంతకముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, రాజస్థాన్ రాయల్స్(RR) కెప్టెన్ సంజూ శాంసన్‌లకు స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా పడింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో మాథ్యూ షార్ట్ (36), జితేష్ శర్మ (25) రాణించారు. లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లల్లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (67;49 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. వృద్ధిమాన్ సాహా(30; 19 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు.
IPL 2023: గెలుపు సంగతి అటుంచితే.. ఆటగాళ్లను కాపాడుకోవడమే చెన్నైకి పెద్ద పని