Asia Cup 2022: బుమ్రాను అనుకరిస్తూ బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాను అనుకరిస్తూ బౌలింగ్ చేశాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ఇందుకు సంబంధించిన వీడియోను హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శ్రీలంక వేదికగా జరగాల్సిన ఆసియా క‌ప్‌ను ఆ దేశంలోని పరిస్థితుల దృష్ట్యా యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే. ఈ నెల 27 నుంచి సెప్టెంబ‌రు 11 వ‌ర‌కు ఆసియా క‌ప్ టోర్న‌మెంట్ జ‌ర‌గనుంది. దీన్ని టీ20 ఫార్మాట్‌లో నిర్వ‌హిస్తారు.

Asia Cup 2022: బుమ్రాను అనుకరిస్తూ బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్

Asia Cup 2022

Asia Cup 2022: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాను అనుకరిస్తూ బౌలింగ్ చేశాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ఇందుకు సంబంధించిన వీడియోను హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శ్రీలంక వేదికగా జరగాల్సిన ఆసియా క‌ప్‌ను ఆ దేశంలోని పరిస్థితుల దృష్ట్యా యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే. ఈ నెల 27 నుంచి సెప్టెంబ‌రు 11 వ‌ర‌కు ఆసియా క‌ప్ టోర్న‌మెంట్ జ‌ర‌గనుంది. దీన్ని టీ20 ఫార్మాట్‌లో నిర్వ‌హిస్తారు.

ఈ నేపథ్యంలోనే టీమిండియా సాధన చేస్తోంది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఆ టోర్నమెంట్ ఆడనుంది. ఈ టోర్నమెంట్ కు హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. నెట్స్ లో బుమ్రాను అనుకరిస్తూ పాండ్యా వేసిన బౌలింగ్ పై పలువురు ప్రముఖులు స్పందించారు. బుమ్రా కూడా ఈ వీడియోపై స్పందిస్తూ ‘సెలబ్రేషన్స్’ అని కామెంట్ చేశాడు.

కాగా, ఆసియా కప్ మ్యాచులు ప్రారంభం కావడానికి సమయం దగ్గరపడడంతో ఆ టోర్నమెంట్లో ఆడే జట్లు ప్రాక్టీసులో చెమటోడుస్తున్నాయి. శ్రీ‌లంక‌లో ఆర్థిక సంక్షోభం కార‌ణంగా హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్న నేప‌థ్యంలో ఆసియా క‌ప్ ను దుబాయి, షార్జాలో నిర్వహిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

Retail Price Of Rice Rises: ఇప్పటికే గోధుమ ధరల పెరుగుదల.. ఇప్పుడు బియ్యం ధరలూ ఆ బాటలోనే..