Hardik Pandya: ల‌క్నోకు ఆడాల‌ని అనుకున్నా.. ఆ ఒక్క ఫోన్ కాల్ మొత్తం మార్చేసింది

ముంబై ఇండియ‌న్స్ త‌న‌ను విడిచిపెట్టిన త‌రువాత కొత్త ప్రాంఛైజీ అయిన ల‌క్నో జ‌ట్టు త‌న‌ను సంప్ర‌దించిందని, ఆ జ‌ట్టుకు త‌న మిత్రుడు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉండ‌డంతో ఆ జ‌ట్టు త‌రుపున ఆడేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పాడు హార్దిక్ పాండ్యా.

Hardik Pandya: ల‌క్నోకు ఆడాల‌ని అనుకున్నా.. ఆ ఒక్క ఫోన్ కాల్ మొత్తం మార్చేసింది

Hardik Pandya and Ashish Nehra

Hardik Pandya: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ IPL)లో అడుగుపెట్టిన తొలి సీజ‌న్‌లోనే గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టును విజేత‌గా నిలిచాడు హార్దిక్ పాండ్యా. జ‌ట్టును ముందుండి న‌డిపించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో త‌న‌దైన ముద్ర వేశాడు. ఈ సీజ‌న్‌లోనూ హార్దిక్ సార‌ధ్యంలోని గుజ‌రాత్ జ‌ట్టు దూసుకుపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు మ్యాచ్‌లు ఆడ‌గా మూడింటిలో విజ‌యం సాధించింది. ఓ మ్యాచ్‌లో ఓట‌మి పాలై పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో కొన‌సాగుతోంది. గుజ‌రాత్‌ను ముందుండి న‌డిపిస్తున్న హార్దిక్ పాండ్యా తాజాగా ఓ ఆసక్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించాడు.

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు షాక్‌.. మ్యాచ్‌ గెలిచామ‌న్న ఆనందం లేకుండా పోయిందే

ముంబై ఇండియ‌న్స్ త‌న‌ను విడిచిపెట్టిన త‌రువాత కొత్త ప్రాంఛైజీ అయిన ల‌క్నో జ‌ట్టు త‌న‌ను సంప్ర‌దించిందని, ఆ జ‌ట్టుకు త‌న మిత్రుడు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉండ‌డంతో ఆ జ‌ట్టు త‌రుపున ఆడేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పాడు.”ల‌క్నో జ‌ట్టు నుంచి నాకు ఫోన్ వ‌చ్చింది. ఆ జ‌ట్టుకు కేఎల్ రాహుల్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఆ స‌మ‌యంలో నేనున్న ప‌రిస్థితుల్లో నాకు బాగా తెలిసిన వ్య‌క్తి అయిన కేఎల్ రాహుల్ సార‌ధ్యంలో ఆడాల‌ని అనుకున్నా. నాకు ప‌రిచ‌యం లేని వ్య‌క్తుల కంటే నా గురించి బాగా తెలిసిన రాహుల్ జ‌ట్టులో ఆడితే బాగుంద‌ని భావించా.” అని హార్దిక్ పాండ్యా చెప్పాడు.

Jio Cinema : జియో సినిమా సూపర్ ప్లాన్.. IPL ఫ్రీనే కానీ సినిమా కంటెంట్‌కు మాత్రం డబ్బులు కట్టాల్సిందే..

ఆ త‌రువాత ఆశిష్ నెహ్రా నుంచి ఫోన్ రావ‌డంతో త‌న మ‌నసు మార్చుకున్న‌ట్లు హార్దిక్ పాండ్యా తెలిపాడు. నెహ్రా నాకు ఫోన్ చేశాడు. అప్ప‌టికి గుజ‌రాత్ జ‌ట్టు ఐపీఎల్‌లో పాల్గొనేందుకు అనుమ‌తి రాలేదు. ప‌రిస్థితి కొంచెం గంద‌ర‌గోళంగానే ఉంది. అయినా నెహ్రా ఒక‌టే చెప్పాడు. ”ఇంకా నిర్ణ‌యం అయితే కాలేదు కానీ.. ఆ జ‌ట్టుకు నేను కోచ్‌గా ఉంటున్నా.” అని చెప్పాడు. ”నేను ఒక‌టే చెప్పాను. అశు ఫా మీరు లేక‌పోతే నేను ఆ (గుజ‌రాత్) జ‌ట్టులో చేర‌డానికి అంగీక‌రించేవాడిని కాదు. ఎందుకంటే మీ కంటే న‌న్ను ఎవ‌రూ బాగా అర్ధం చేసుకోలేరు.” అని అన్నా. ఫోన్ సంబాష‌ణ ముగిసిన అనంత‌రం నెహ్రా నుంచి నాకు ఓ మెసెజ్ వ‌చ్చింది. ”జ‌ట్టుకు కెప్టెన్ గా ఉంటావా అని. నేను షాకైయ్యా.” అని ఆనాటి ప‌రిస్థితుల‌ను హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.