Hasan Ali : క్రికెటర్, అతడి భార్యపై బూతులు.. మళ్లీ రెచ్చిపోయిన అభిమానులు

ఈసారి పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ బాధితుడయ్యాడు. పాక్ క్రికెట్ అభిమానులు కొందరు రెచ్చిపోయారు. హసన్ అలీని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు.

Hasan Ali : క్రికెటర్, అతడి భార్యపై బూతులు.. మళ్లీ రెచ్చిపోయిన అభిమానులు

Hasan Ali

Hasan Ali : ఆట అన్నాక గెలుపు ఓటములు కామన్. ఓ జట్టు గెలుస్తుంది మరో జట్టు ఓడిపోతుంది. ఫలితం ఏదైనా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే క్రీడా స్ఫూర్తి. అయితే క్రికెట్ లో మాత్రం అలా జరగడం లేదు. కొందరు క్రికెట్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. తమ జట్టు ఓడిపోతే అస్సలు ఊరుకోవడం లేదు. క్రికెటర్లను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు. వారినే కాదు వారి ఫ్యామిలీని కూడా లాగుతున్నారు.

YouTube: యూట్యూబ్‌లో ఫ్యాన్ వార్‌కి చెక్.. ఇక ఆ కౌంట్ కనిపించదు

సోషల్ మీడియాలో నీచమైన, అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. పచ్చి బూతులు తిడుతున్నారు. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో ఓటమి తర్వాత భారత క్రికెటర్లు మహమ్మద్ షమీ, కెప్టెన్ విరాట్ కోహ్లికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. కొందరు వ్యక్తులు విరాట్ కోహ్లి కూతురిని రేప్ చేస్తామని బెదిరించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ బెదిరింపుల కేసులో పోలీసులు హైదరాబాద్ కి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.

తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి రిపీట్ అయ్యింది. ఈసారి పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ బాధితుడయ్యాడు. పాక్ క్రికెట్ అభిమానులు కొందరు రెచ్చిపోయారు. హసన్ అలీని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. హసన్ అలీ వల్లే టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఫైనల్ చేరలేదని నిందించారు. అసభ్యకరంగా దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అంతేకాదు హసన్ అలీ భార్యను కూడా వదల్లేదు. ఆమెపైనా బూతులు పెడుతున్నారు. హసన్ అలీ భారత్ కు చెందిన సమియా అర్జూని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇందులో సమియాను కూడా లాగి ఆమె ఇన్ స్టా అకౌంట్ లో బూతు కామెంట్లు పెడుతున్నారు.

Snake : పాము కాటుకు గురైన వెంటనే ఏం చేయాలో తెలుసా?

కాగా, భారతీయులు మాత్రం హసన్ కు మద్దుతుగా ట్వీట్లు చేస్తున్నారు. అది కేవలం ఓ మ్యాచ్ మాత్రమే, హసన్ అలీని నిందించడం కరెక్ట్ కాదంటున్నారు. 200 మిలియన్ల పాకిస్తాన్ ప్రజలు కాదు 135 కోట్ల భారత ప్రజలు నీకు అండగా ఉన్నారని మరో భారతీయుడు ట్వీట్ చేశాడు. వుయ్ స్టాండ్ విత్ హసన్ అలీ అని ట్వీట్లు చేస్తున్నారు. ఓటమికి బాధ్యుడిని చేస్తూ క్రికెటర్ ను నిందించడం మంచిది కాదని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఆసీస్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆసీస్ బ్యాటర్ మాథ్యూ వేడ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా మూడు సిక్సులు బాది పాకిస్తాన్ ఓటమికి కారణం అయ్యాడు. కాగా, వేడ్ ఇచ్చిన క్యాచ్ ను పాక్ పేసర్ హసన్ అలీ జారవిడిచాడు. ఆ తర్వాతే వేడ్ మరింత రెచ్చిపోయి ఆడాడు. హసన్ అలీ ఆ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని పాక్ క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. పాక్ ఓటమికి హసన్ అలీ కారణం అంటున్నారు. దీంతో కొందరు అభిమానులు వ్యక్తిగతంగా హసన్ అలీని టార్గెట్ చేశారు. హసన్ అలీ కీలకమైన క్యాచ్ జారవిడవటమే కాదు బౌలింగ్ లోనూ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. అతడు ఏకంగా 44 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీలేదు.