MS Dhoni: సెకండ్ రిచెస్ట్ క్రికెటర్.. ధోని నికర ఆస్తుల విలువెంతో తెలుసా?

రాంచీకి చెందిన భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని.. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన క్రికెటర్ల జాబితాలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లతో పాటుగా చేర్చబడింది.

MS Dhoni: సెకండ్ రిచెస్ట్ క్రికెటర్.. ధోని నికర ఆస్తుల విలువెంతో తెలుసా?

MS Dhoni: రాంచీకి చెందిన భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని.. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన క్రికెటర్ల జాబితాలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లతో పాటుగా చేర్చబడింది. క్రికెట్ ఫీల్డ్‌లో తన తెలివితేటలు, ప్రతిభతో భారత జట్టుకు ఘనకీర్తిని అందించిన ధోనీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.

భారత క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరైనప్పటికీ ఐపీఎల్‌ మ్యాచ్‌లు మాత్రం ఆడుతూనే కనిపిస్తున్నాడు ఎమ్‌ఎస్ ధోని. ఐపీఎల్‌లో యాడ్ ఫిల్మ్‌లు, మ్యాచ్‌ల ద్వారా కోట్ల రూపాయలు మాత్రం సంపాదిస్తూనే ఉన్నాడు ధోని.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా కూడా పాపులారిటీ విషయంలోనూ.. అభిమానుల సంఖ్యలోనూ ఏమాత్రం తగ్గలేదు. ధోని ఇప్పటికీ యువ, వర్ధమాన క్రికెటర్లకు రోల్ మోడల్‌గానే ఉన్నారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ధోని తన కష్టంతో క్రికెట్ మైదానంలో నిలదొక్కుకుని ప్రపంచంలోనే గొప్ప ఆటగాడిగా నిలచాడు.

ధోనీకి బైక్‌లపై ఉన్న ప్రేమ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. ధోనికి క్రికెట్‌తో పాటు బైక్ నడపడం అంటే చాలా ఇష్టం. ఈ అభిరుచి కారణంగానే ధోని రాయల్ ఇన్ ఫీల్డ్, సుజుకి హయభూసా, కవాసకి నింజా, యమా థండ్రెట్ వంటి బైక్‌లను కొనుగోలు చేసుకున్నాడు. దీనితో పాటు రేంజ్ రోవర్ కార్, గ్రాండ్ పోర్చ్, బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ జి వ్యాగన్ వంటి లగ్జరీ కార్లు కూడా ధోనికి ఉన్నాయి.

ఇదిలా ఉంటే, ధోని నికర ఆస్తి విలువ దాదాపు రూ. 819 కోట్లు. దీంతో పాటు బీసీసీఐ, ఐపీఎల్, ప్రకటనల ద్వారా కూడా ధోనీకి కోట్లాది రూపాయలు వస్తున్నాయి. అతను IPML ప్రతి సీజన్‌లో దాదాపు రూ.15కోట్లు సంపాదిస్తాడు. ధోని ఇప్పటికీ రాంచీలో నివసిస్తున్నాడు. అక్కడ అతనికి ఫామ్ హౌస్‌లు కూడా ఉన్నాయి. ఢిల్లీలో విలాసవంతమైన హౌస్ కూడా ధోనికి ఉంది. క్రికెట్‌లోకి రాకముందు, ధోనీ రైల్వేలో టిక్కెట్ కలెక్టర్‌గా పనిచేశాడు.

ధోనీ కెరీర్‌లో 90 టెస్టులు, 350 వన్డేలు మరియు 98 T20 ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడాడు. టెస్ట్‌ల్లో ఆరు సెంచరీలు, 33 హాఫ్ సెంచరీల సాయంతో మొత్తం 4వేల 876 పరుగులు చేశాడు. ఇది కాకుండా, అతను వన్డేలలో 73 అర్ధ సెంచరీలు, 10 సెంచరీలు చేశాడు మొత్తం 10773 పరుగులు చేశాడు. టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో ధోనీ మొత్తం 1617 పరుగులు చేశాడు. ధోనీ వన్డేల్లో వెస్టిండీస్‌కు చెందిన ట్రావిస్ డోలిన్ వికెట్ తీశాడు, ఇది అతని ఏకైక అంతర్జాతీయ వికెట్.