ధావన్ ఒక ఇడియట్.. ఫస్ట్ బాల్ ఆడడు: రోహిత్ శర్మ

  • Published By: Subhan ,Published On : May 9, 2020 / 12:55 PM IST
ధావన్ ఒక ఇడియట్.. ఫస్ట్ బాల్ ఆడడు: రోహిత్ శర్మ

అంతర్జాతీయ క్రికెట్ ఓపెనర్ల జోడీలో రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ లది సక్సెస్‌ఫుల్ పెయిర్. 107ఇన్నింగ్స్‌ల భాగస్వామ్యంతో 4వేల 802వన్డే పరుగులు చేశారు. 50ఓవర్ల ఫార్మాట్లో నాలుగో టాప్ జోడీ ఇది. వీరి చేతుల మీదుగా పదుల సంఖ్యలో మ్యాచ్ లు గెలిపించారు. వీరి శుభారంభం చేసిన చాలా మ్యాచ్ లు ఇండియా గెలిచింది. ఇది ఇన్నేళ్లకు కుదిరింది కానీ, ఆరంభంలో ఈ జోడీకి తంటాలు తప్పలేదు. 

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడిన రోహిత్ శర్మ 2013 చాంపియన్స్ ట్రోఫీలో జరిగిన ఫన్నీ సన్నివేశం గురించి చర్చించాడు. 50ఓవర్ల ఫార్మాట్లో ధావన్ తో అప్పుడే కొత్తగా ఓపెనర్ గా జత అయ్యాడు రోహిత్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ధావన్ తో ఓపెనింగ్ పెయిర్ పంచుకునే వార్నర్ తో ఇలా చెప్పాడు.

అతనొక ఇడియట్.. ఫస్ట్ బాల్ ఫేస్ చేయడానికి ఇష్టపడడు. స్పిన్నర్లు బౌలింగ్ వేస్తున్నప్పుడు బ్యాట్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఫాస్ట్ బౌలర్లను ఫేస్ చేయడం ఇష్టం ఉండదు. 2013లో లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్ కు ఓపెనర్ గా కెరీర్ స్టార్ట్ చేస్తున్న రోజులు. అది చాంపియన్స్ ట్రోఫీలో నా సెకండ్ ఇన్నింగ్స్. దక్షిణాఫ్రికా జట్టుతో ఆడుతున్నాం. మోర్నో మోర్కెల్, డేల్ స్టెయిన్ కు జట్టులో ఉన్నారు. 

కొత్త బంతిని నేనెప్పుడూ ఫేస్ చేయలేదు. నేను శిఖర్ కు చెప్పాను నువ్వు స్ట్రైక్ తీసుకొమ్మని చెప్పాను. లేదు రోహిత్ నువ్వు చాలా కాలంగా ఆడుతున్నావు. ఇది నా ఫస్ట్ ఓవర్. నేను తీసుకోలేను. నువ్వు ఫేస్ చేయాల్సిందే. రెగ్యూలర్ ఓపెనర్ గా దిగేవాడు స్ట్రైకింగ్ కు దిగడానికి ఇష్టపడలేదు. అప్పుడు మోర్కెల్ బౌలింగ్ లో నేను ఆడాను. నేను చూడలేదు కూడా. నేను బౌన్స్ ఊహించలేదు. దానికి నేను సిద్ధంగా కూడా లేను. 

కొత్త బంతి ఎలా బిహేవ్ చేస్తుందో కూడా నాకు తెలీదు. అది ఇంగ్లాండ్ గడ్డ మీద. ఆ రోజు నేను కచ్చితంగా బౌల్డ్ అయిపోయా. అది శిఖర్ ధావన్ తో నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్.  ఇప్పుడు కంఫర్టబుల్ గానే ఉన్నాం. కొన్ని సార్లు మాత్రం విసిగిస్తుంటాడు. ఒక బౌలర్ స్టైల్ చెప్పి మనం ఇలా ఆడదాం. అని చెప్తే కొద్ది సెకన్లు ఆగి మళ్లీ వచ్చి ఏమన్నావని అడుగుతుంటాడు. గేమ్ మధ్యలో చాలా ఒత్తిడిగా ఉన్న సమయంలోనూ అతను అలా చేస్తుంటాడు. అప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. 

ఇంకొకటి బాల్ ను డిఫెండ్ చేసేటప్పుడు రెండు మూడు అడుగులు ముందుకేస్తుంటాడు. అప్పుడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్నవారికి కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంటాడు. రన్ కి రావాలా వద్దా అని. ఇన్ని సంవత్సరాల పార్టనర్‌షిప్ తర్వాత అర్థమైంది. బాల్ గ్యాప్ లోకి వెళ్లకుండా నేను రన్ కు వెళ్లకూడదని. అలా చేసి చాలా పరుగులు కోల్పోయాం. దానికి నిరుత్సాహపడటం లేదు. కానీ, దాని గురించి చాలా సార్లు సమస్యలో పడేవాడ్ని.. అంటూ మాట్లాడుతుంటే వార్నర్ నవ్వుతూ ఉన్నాడు.