విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా ప్లేయర్లకు ప్రేమా, ద్వేషం రెండూ..: టిమ్

10TV Telugu News

Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రత్యర్థి జట్లు గుర్రుమంటూ ఉంటాయి. అయితే ఆస్ట్రేలియా ప్లేయర్లకు కోహ్లీపై ద్వేషంతో పాటు ప్రేమ కూడా ఉంటుందట. కొన్నేళ్ల నుంచి కోహ్లీ అంటే ఆస్ట్రేలియా జట్టు ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తుంది. విరాట్ జట్టులో ఉన్నాడంటేనే ఆ జట్టు ప్రవర్తనా తీరు వేరేలా ఉంటుంది.

ఇప్పుడు మరో కొద్ది రోజుల్లో మొదలుకానున్న ఆస్ట్రేలియాలో ఇండియా పర్యటన సందర్భంగా ఆసీస్ టెస్ట్ కెప్టెన్ టిమ్ పైనె ఈ విధంగా స్పందించాడు. కాంపిటీటర్స్‌గా కోహ్లీని ద్వేషించడం ఇష్టం. ఓ ప్లేయర్ గా అతని బ్యాటింగ్ తీరును చూడటం అంతే ఇష్టం కూడా అని టిమ్ పైనె అంటున్నాడు.‘విరాట్ కోహ్లీ గురించి చాలా అడిగారు. అతను నాలాగా ఓ ప్లేయర్ మాత్రమే. అతనేదో నన్ను భయపెట్టేస్తాడని కాదు. అతనితో మంచి రిలేషన్‌షిప్ ఏమీ లేదు. టాస్ వేసినప్పుడు మాత్రమే అతణ్ని చూస్తా. ఆ తర్వాత ఆడతాం’ అంతేనని పైనె అంటున్నాడు.

విరాట్ చేసే పనులు మాకు నచ్చవు. అంతేస్థాయిలో అతని బ్యాటింగ్ స్టైల్ ను చూడటం ఇష్టం. అలా అని ఎక్కువ పరుగులు చేయనివ్వం. ఆస్ట్రేలియా, ఇండియా మ్యాచ్ లలో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మేం నోరుజారాం కానీ, అతను కెప్టెన్, నేనూ కెప్టెన్ అని కాదు’ అని పైనె చెప్పుకొచ్చాడు.

2012లో ఆస్ట్రేలియాలో ఆడిన టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2014లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 0-2తో టీమిండియా ఓడిపోయినప్పటికీ మరో సారి నాలుగు మ్యాచ్‌లలో నాలుగు వందలకు పైగా స్కోరు, 2 సెంచరీలు చేయగలిగాడు. చివరిగా జరిగిన మ్యాచ్ లలో కోహ్లీ 282పరుగులు చేసి ఇండియా టెస్టు ఫార్మాట్ గెలవడంలో కీలకం అయ్యాడు.

‘ఏదైనా జట్టుతో ఆడుతున్నామంటే అందులో బెస్ట్ ప్లేయర్ తో మనకు టెన్షన్ తప్పదు. ఉదాహరణకు ఇంగ్లాండ్‌తో ఆడితే జో రూట్, బెన్ స్టోక్స్ లాంటి వాళ్లు. అలాంటి ప్లేయర్లు క్రీజులోకి వస్తున్నారంటేనే అలా అనిపిస్తుంటుంది. నిజాయతీగా చెప్తున్నా ఇది చాలా పెద్ద సిరీస్’

‘చివరి సారి పర్యటనలో వాళ్లు మమ్మల్ని ఓడించారు. కాకపోతే అది వేరే టీం. బెస్ట్ జట్టుతో ఆడుతున్నప్పుడు మనమేంటో నిరూపించుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది’ అని ముగించాడు.

10TV Telugu News