T20 World Cup 2021: ఇండియా, పాకిస్తాన్ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌!

టీ20 వరల్డ్‌కప్‌లో ఖతర్నాక్ మ్యాచ్‌కు.. కౌంట్ డౌన్ మొదలైపోయింది.

T20 World Cup 2021: ఇండియా, పాకిస్తాన్ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌!

Betting

T20 World Cup 2021: టీ20 వరల్డ్‌కప్‌లో ఖతర్నాక్ మ్యాచ్‌కు.. కౌంట్ డౌన్ మొదలైపోయింది. మరికొన్ని గంటల్లో భారత్-పాకిస్తాన్ క్రికెట్ టీమ్స్.. హెడ్ టు హెడ్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇండియా, పాకిస్తాన్ మాత్రమే కాదు.. వరల్డ్ వైడ్‌గా క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. మైదానంలో జరగబోయే దాయాదుల సమరం ఎలా ఉండబోతుందా..? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

దుబాయ్ వేదికగా.. ఈ మెగా మ్యాచ్ జరగబోతోంది. ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాకిస్తాన్.. వరల్డ్‌కప్ టోర్నీ తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. టీ20 ఫార్మాట్‌లో.. పాకిస్తాన్‌పై పూర్తి ఆధిపత్యం ఇండియాదే కొనసాగుతోంది. రెండు టీమ్స్ 8 సార్లు తలపడగా.. 7 మ్యాచ్‌ల్లో టీమిండియానే విక్టరీ కొట్టింది. ఒకే ఒక్క మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచింది.

ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో అయితే బెట్టింగ్‌ రాయుళ్లు బరితెగించారు. టీమ్‌లో ఎవరికి చోటు దక్కుతుందన్నది మొదలు టాస్ ఎవరు గెలుస్తారు.. మ్యాచ్‌ ఎవరు గెలుస్తారన్న వరకు భారీ బెట్టింగ్స్‌ నిర్వహిస్తున్నారు. వికెట్టు వికెట్టుకు, ప్రతీ బౌండరీకి బెట్టింగ్‌ కాస్తున్నారు. ఆన్‌లైన్ మార్కెట్‌లో పాకిస్తాన్‌పై 1000కి 1600, ఇండియాపై వెయ్యికి రూ.530వరకు ఉందని అంటున్నారు. బయట మార్కెట్లో పాకిస్తాన్‌పై వెయ్యికి నాలుగు వేల రూపాయలు, ఇండియాపై వెయ్యికి 2 వేలు.. బెట్టింగ్ మాఫియాపై పోలీసులు నజర్ అవుతున్నారు.

మొదటి బంతి నుంచి చివరి బంతి వరకు బెట్టింగ్‌లకు ప్లాన్ చేస్తున్నారు బుకీలు. క్రికెట్ అభిమానులను ఆకర్షించేందుకు కొత్త కొత్త రేట్లు ఫిక్స్‌ చేస్తూ ఆశ చూపుతున్నారు బుకీలు. తెలంగాణలో ఆన్‌లైన్‌ మార్కెట్‌లో పాకిస్తాన్‌పై వెయ్యికి 2 వేలు, ఇండియాపై వెయ్యికి 13 వందలు బెట్టింగ్ కాస్తున్నారు. బహిరంగ మార్కెట్లో పాక్ పై వెయ్యికి 4 వేలు, ఇండియాపై వెయ్యికి 2 వేలు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్ పాకిస్తాన్‌పై వెయ్యికి 2 వేలు, ఇండియాపై వెయ్యికి 13 వందల బెట్టింగ్ కాస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో పాక్‌పై వెయ్యికి 4 వేలు, ఇండియాపై వెయ్యికి 2 వేలు బెట్టింగ్ వేస్తున్నారు.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై ఉండే క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్న బుకీలకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. గతంలో అరెస్ట్ చేసిన బుకీలపై ఏపీ, తెలంగాణ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. యువత బెట్టింగ్‌లకు పాల్పడి డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. బెట్టింగ్ పాల్పడుతూ పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Read More:

మళ్లీ భారత్‌దే విజయమా? పాకిస్తాన్ చరిత్ర తిరగరాస్తుందా? మ్యాచ్ ప్రిడిక్షన్.. పిచ్, పూర్తి జట్టు వివారాలు!!