అదరగొట్టేశారుగా: నో నాయీస్.. ఓన్లీ పర్‌ఫార్మెన్స్

అదరగొట్టేశారుగా: నో నాయీస్.. ఓన్లీ పర్‌ఫార్మెన్స్

చేసే పనికి ప్రచారం అక్కర్లేదని కేవలం పని మాత్రమే చేసుకుంటూ పోవాలని చెప్తోన్న వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. అథ్లెట్లు హిమ దాస్, దీపా కర్మాకర్, సిమ్రన్‌జిత్ కౌర్‌లు ఇటీవల చేసిన కమర్షియల్ యాడ్‌కు మంచి స్పందన లభిస్తోంది. నిజ జీవితంలో వారు ఎటువంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా ప్రపంచ స్థాయి హోదా దక్కించుకున్న వారు. 

ఈ కోణంలోనే వారిని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది సదరు కంపెనీ. ఇక యాడ్ విషయానికొస్తే.. బాక్సర్ సిమ్రన్‌జిత్ కౌర్ ప్రాక్టీస్ చేసుకునేందుకు వచ్చి స్కిప్పింగ్‌ రోప్‌తో సైలెంట్ గా వార్మప్ చేసుకోవడం నుంచి మొదలవుతోంది. 

గల్లీ క్రికెట్ ఆడుతోన్న పిల్లలకు హిమదాస్ బాల్ అందించి ముందుకువెళ్లిపోతుంది. సరిగ్గా సమయాన్ని ఫిక్స్ చేసుకుని స్టాప్ వాచ్ లో అనుకున్న టైంకి టార్గెట్ పూర్తి చేసుకుంటుంది. ఆ తర్వాత జిమ్నాస్టిక్ దీపా కర్మాకర్ యాడ్‌లో టైటిల్ విజేతగా నిలిచి ఎయిర్ పోర్టుకు చేరుకుంటుంది. ఘన స్వాగతం లభించినప్పటికీ ఆమె నిరాడంబరంగా వచ్చి స్టేడియంలో ప్రాక్టీస్ చేసుకుంటుంది. 

ఇలా రూపొందించిన యాడ్ లలో క్లైమాక్స్ మాత్రం వారంతా కలిసి హైయర్ కంపెనీ తయారుచేసిన ఆటోమెటిక్ వాషింగ్ మెషీన్ దగ్గరే ముగుస్తుంది. నో నాయీస్ ఓన్లీ పర్‌ఫార్మన్స్ అనే ట్యాగ్ లైన్ తో యాడ్ అయిపోతుంది. అంటే వాషింగ్ మెషీన్ సౌండ్ రాకుండా పనిచేస్తుందనే అర్థం కాబోలు. ఈ వీడియోలు రూపొందించడంలో డైరక్టర్ కొత్త తరహాలో ఆలోచించడంతో వైరల్‌గా మారాయి.